kumaram bheem asifabad- గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలి
ABN , Publish Date - Jun 04 , 2026 | 10:45 PM
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంపీడీవో అంజద్‌పాషా అన్నారు. గోయ గాం, ధనోర, కోటారి పంచాయతీల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు. కా
కెరమెరి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): గ్రామాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంపీడీవో అంజద్‌పాషా అన్నారు. గోయ గాం, ధనోర, కోటారి పంచాయతీల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు. కార్యక్రమంలో ఎంపీవో సాయిరాంగౌడ్, సర్పంచ్ ఆనంద్‌రావు, శాంతబాయి, కార్యదర్శులు మురళీధర్, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో పారిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని తహసీల్దార్ మునావర్ షరీఫ్ అన్నారు. సర్పంచ్ జయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మురికి కాలువలు శుభ్రపర్చాలని తదితర సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నస్రుల్లాఖాన్, ఉప సర్పంచ్ సురేష్, ఆత్మారాం, ఇనోష్, ప్రకాష్, అధిత్య, తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండలంలోని తుమ్డిహేట్టి, గుండాయిపేట, వీర్ధండి, తాటినగర్, మొగడ్‌దగడ్ తదితర గ్రామాల్లో గురువారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికల్లో భాగంగా గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రసాద్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అంతా సహకరించాలని కోరారు. అలాగే వన మహోత్సవంపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్‌లు, ఎంఈవో నానాజీ, ఏవో ప్రేమలత, సీఐ, ఎస్సై పాల్గొన్నారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండలంలోని వేంపల్లి, అచ్చెల్లి, చింతగూడ, రుద్రారం గ్రామంలో ప్రత్యేక ప్రాలన కార్యక్రమం సందర్భంగా గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బి.సత్యనారాయణ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంపై తాగునీరు, సాగునీరుతో పాటు పారిశుధ్యం, మురికి కాల్వలు, వీధి లైట్లు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ చిన్న ఇబ్బందులు కలిగిన దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం వివిధ గ్రామాల్లో వివిధ సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. గ్రామసభల్లో తహసీల్దార్ రహీమోద్దీన్, ఎంపీవో బి.వినోద్, సిర్పూరు(టి) ఎస్సై సాగర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని శివనూర్, గుబ్బగూడ, రాంనాయక్ తండా, ఆశపెల్లి, జంగాం, పోచంలొద్ది, పార తదితర గ్రామ పంచాయతీల్లో గురువారం సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. సర్పంచ్ జాదవ్ శ్రావణ్‌నాయక్ పలు సమస్యలు ప్రస్తావించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆఢ బీర్షావ్, సర్పంచ్‌లు జాదవ్ శ్రావణ్ నాయక్, మడావి కౌసల్యబాయి, రాథోడ్ రాందాస్, మరప రవిందర్, పంద మడావి మనోహర మేస్రాం జంగుబాయి, పెందుర్ అనసూయ బాయి, గ్రామ కార్యదర్శులు సురేఖ, ఆనంద్‌రావ్, మనోజ్, గణేశ్, సత్యనారాయణ, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.