విద్యార్థుల అభ్యాసన స్థాయిపై స్పష్టత
ABN , Publish Date - Oct 08 , 2026 | 12:23 AM
తొమ్మిదో తర గతి విద్యార్థుల సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 ( ఎస్‌ఏ- 1) పరీక్షల జవాబు పత్రాలకు బాహ్య మూల్యాంకనం కొన సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 3631 మంది 9వ తరగతి విద్యార్థులు ఈ మూల్యాంకన పరిధిలో
పెద్దపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తొమ్మిదో తర గతి విద్యార్థుల సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 ( ఎస్‌ఏ- 1) పరీక్షల జవాబు పత్రాలకు బాహ్య మూల్యాంకనం కొన సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 3631 మంది 9వ తరగతి విద్యార్థులు ఈ మూల్యాంకన పరిధిలో ఉన్నారు. విద్యా ర్థులు చదువుతున్న పాఠశాలల్లో కాకుండా ఇతర పాఠ శాలలకు చెందిన ఉపాధ్యాయులతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తుండటంతో విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేసే అవకాశం ఏర్పడుతోంది.
ఫ మండల కేంద్రాల్లో మూల్యాంకనం
మండల కేంద్రాల్లో మూల్యాంకనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతీ కేంద్రంలో 5 నుంచి 8 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు రోజుకు 320 నుంచి 350 పత్రాల మూల్యంకనం చేస్తున్నారు. వీరితోపాటు ఒక చీఫ్ ఎగ్జామినర్, ఒక అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్ విధు లు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్ సమన్వయంతో మూల్యాంకన ప్రక్రియ సజావుగా కొనసాగేలా చూస్తున్నారు.
ఫ 103 ప్రభుత్వ పాఠశాలలు
జిల్లాలో 9వ తరగతి విద్యార్థులు వివిధ రకాల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో 103 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటితోపాటు 7 మోడల్ స్కూళ్లు, 10 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అలాగే ఎయిడెడ్ పాఠశాల, టీఆర్‌ఈఐఎస్ పరిధిలోని పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలు బాహ్య మూల్యాంకన విధానంలో పరిశీలిస్తున్నారు.
ఫ సొంత పాఠశాలలో కాకుండా.
సాధారణంగా విద్యార్థుల జవాబు పత్రాలను అదే పాఠశాల ఉపాధ్యాయులు మూల్యాంకనం చేస్తుంటారు. అయితే బాహ్య మూల్యాంకన విధానంలో ఇతర పాఠశా లలకు చెందిన ఉపాధ్యాయులకు జవాబు పత్రాలను కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థితో ఉపాధ్యాయుడికి ఉన్న వ్యక్తిగత పరిచయం, పాఠశాల స్థాయి ప్రభావం వంటివి మార్కులపై ప్రభావం చూపకుండా ఉండే అవకాశం ఉంది.
ఫ విద్యార్థుల సామర్థ్యంపై స్పష్టత
బాహ్య మూల్యాంకనం ద్వారా 9వ తరగతి విద్యా ర్థుల వాస్తవ అభ్యసన సామర్థ్యంపై స్పష్టత వచ్చే అవ కాశం ఉంది. ఏ సబ్జెక్టులో విద్యార్థులు మెరుగ్గా ఉన్నా రు? ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారనే విషయాలను ఫలితాల విశ్లేషణ ద్వారా గుర్తించవచ్చు. దీని ఆధారంగా విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించి ప్రత్యేక బోధన అందించేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో పాటు.. ఆయా పాఠశాలల్లో బోధనా విధానాలను మెరు గుపర్చేందుకు ఈ ఫలితాలు ఉపయోగపడనున్నాయి.
ఫ విద్యా ప్రమాణాల అంచనాకు దోహదం
ఒకే విధమైన ప్రశ్నపత్రానికి వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయడం వల్ల పాఠశాలల మధ్య విద్యా ప్రమాణాలను పోల్చుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా బోధనలో లోపాలను గుర్తించడంతోపాటు విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించవచ్చు.
ఫ రోజూ పర్యవేక్షిస్తున్నాం
- డీఈఓ ఏ శారద
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 9వ తరగతి విద్యా ర్థుల బాహ్య మూల్యాంకనం కొనసాగుతోంది. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మూల్యాంకన బృందాల ద్వారా జవాబు పత్రాలను పరిశీలిస్తున్నాం. మండల కేంద్రాలలో ఎంఈఓలు క్యాంపు ఆఫీసర్లు పర్యవేక్షిస్తు న్నారు. 9వ తరగతి నుంచే బాహ్య మూల్యాంకనం అమలు చేయడం వల్ల విద్యార్థుల ప్రతిభపై వాస్తవ అంచనా వచ్చే అవకాశం ఉంది. పాఠశాలల్లో మార్కుల కేటాయింపులో ఉండే తేడాలను తగ్గించడంతోపాటు.. విద్యార్థులు ఏ స్థాయిలో నేర్చుకుంటున్నారో తెలుసుకు నేందుకు దోహదపడుతుంది.