Share News

నేడు హైకోర్టు జోన్‌-2 భవన శంకుస్థాపన

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:50 AM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్మించే తెలంగాణ హైకోర్టు జోన్‌-2 భవన నిర్మాణ పనులకు ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ శంకుస్థాపన చేయనున్నారు.

నేడు హైకోర్టు జోన్‌-2 భవన శంకుస్థాపన

  • హైదరాబాద్‌కు చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్‌ సూర్యకాంత్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నిర్మించే తెలంగాణ హైకోర్టు జోన్‌-2 భవన నిర్మాణ పనులకు ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయనకు సీఎస్‌ కె.రామకృష్ణా రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌ రాజు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఇతర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం 10.30 గంటలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 06:51 AM