Share News

kumaram bheem asifabad-పౌరసేవలు పారదర్శకం

ABN , Publish Date - Apr 29 , 2026 | 10:57 PM

తెలంగాణ రెవెన్యూ సేవల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఆఫీసులో పత్రాల సమర్పణ అనే ద్వంద్వ విధానానికి స్వస్తి పలికింది. ఈ సర్వీసుల విభాగం(మీసేవ) జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇకపై ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే కొనసాగనుంది. దరఖాస్తుదారులు మీసేవలో అప్‌లోడ్‌ చేసిన డేటా నేరుగా అధికారుల మొబైల్‌ యాప్‌లోకి చేరడం ఈ కొత్త విధానంలో కీలక మారు.్ప.... కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల ద్రువీకరణతో పాటు ఈబీసీ, ఓబీసీ వంటి పత్రాల కోసం ప్రజలు ఇకపై పడరాని పాట్లు పడాల్సిన అవసరం లేదు

kumaram bheem asifabad-పౌరసేవలు పారదర్శకం
లోగో

- ఆన్‌లైన్‌లోనే ధ్రువపత్రాల ప్రక్రియ

- ప్రజలకు తప్పనున్న అవస్థలు

బెజ్జూరు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రెవెన్యూ సేవల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఆఫీసులో పత్రాల సమర్పణ అనే ద్వంద్వ విధానానికి స్వస్తి పలికింది. ఈ సర్వీసుల విభాగం(మీసేవ) జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఇకపై ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే కొనసాగనుంది. దరఖాస్తుదారులు మీసేవలో అప్‌లోడ్‌ చేసిన డేటా నేరుగా అధికారుల మొబైల్‌ యాప్‌లోకి చేరడం ఈ కొత్త విధానంలో కీలక మారు.్ప.... కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల ద్రువీకరణతో పాటు ఈబీసీ, ఓబీసీ వంటి పత్రాల కోసం ప్రజలు ఇకపై పడరాని పాట్లు పడాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు మీసేవ కేంద్రాల్లో అప్‌లోడ్‌ చేసే పత్రాలనే ప్రామాణికంగా తీసుకొని అధికారులు పరిశీలన పూర్తి చేస్తారు. జీపీవో, ఎంఆర్‌ఐ వెరిఫికేషన్‌ ప్రక్రియ అంతా మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారానే జరుగుతోంది. దరఖాస్తు చేసుకున్న క్షణం నుంచి సర్టిఫికెట్‌ మంజూరు వరకు ప్రతీ దశ డిజిటల్‌ పద్దతిలోనే సాగనుంది. కొత్త విధానం అమల్లోకి రావడంతో జిరాక్స్‌ కాపీల ఖర్చు, ఫైళ్లను పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. గతంలో మీసేవలో అప్లై చేసినా, ఆ కాగితాలను తహసీల్దార్‌ కార్యాయలంలో అందజే యాల్సి వచ్చేది. అక్కడ వీఆర్వో, ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్ల ఆమోదం కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. వీరంతా క్షేత్రపర్యటనలకంటూ వెళితే అంతే సంగతి. చివరికి పుణ్యకాలం ముగిశాకనే సర్టిఫికెట్లు జారీ అవుతుండేవి. ఈ క్రమంలో మధ్యవర్తుల ప్రమేయం పెరిగి అవినీతికి ఆస్కారం ఉండేది. తాజా నిర్ణయంతో పారదర్శకత పెరగడమే కాకుండా సామాన్యులకు సమయం, డబ్బు ఆదా కానున్నాయి.

- కఠిన నిబంధనలు అమలు..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెవెన్యూ కార్యాలయాల్లో ఇకపై భౌతిక పత్రాలను స్వీకరించకూడదు. ఎవరైనా అధికారులు లేదా మీసేవ నిర్వాహకులు పౌరుల నుం చి కాగితాలు కోరినా, వారిని కార్యాలయాలకు రావాలని వేధించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయడంతో యంత్రాంగంలో చలనం మొదలైంది. కాగా డిజిటల్‌ విప్లవంలో భాగంగా మీసేవ కేంద్రాల నిర్వాహకుల బాధ్యత మరింత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో పత్రాల స్కానింగ్‌ అప్‌లోడింగ్‌ను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. సాంకేతిక లోపాలు తలెత్తకుండా, దరఖాస్తుల్లో తప్పులు దొర్లకుండా చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సమస్యలు ఉన్నప్పటికీ ఈ మార్పు ద్వారా అవినీతికి అడ్డుకట్టపడి సామాన్యులకు సేవలు వేగంగా అందుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2026 | 10:57 PM