Share News

kumaram bheem asifabad- పుర పోరు..కసరత్తు జోరు

ABN , Publish Date - Jan 06 , 2026 | 10:14 PM

జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ఆయా పార్టీలు వ్యూహరచన చేస్తున్నా యి. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల పరిధలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. వీటిల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

kumaram bheem asifabad- పుర పోరు..కసరత్తు జోరు
లోగో

- గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు చర్యలు

- ఆశావహుల వ్యక్తిగత సమాచారం సేకరణ

జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ఆయా పార్టీలు వ్యూహరచన చేస్తున్నా యి. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల పరిధలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. వీటిల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. చైర్మన్‌ పదవులను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతు న్నాయి. ఇటీవల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు విజ యం సాధించిన నేపథ్యంలో మున్సిపాలిటీల్లోనూ గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి. గతంతో పోలిస్తే మెరుగైన పంచాయతీ స్థానాలను సాధించడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలలో జోష్‌ పెంచింది. ఈ క్రమంలో ఆయా పార్టీలు పోటాపోటీగా పోరు కు సన్నహలకు శ్రీకారం చుట్టాయి. పురపాలిక ఎన్నిక ల్లో పాగా వేసేలా వ్యూహలు పన్నుతున్నాయి.

జిల్లాలో రెండు మున్సిపాలిటీలు..

ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు కసరత్తులు ప్రారంభించడంతో జిల్లాలో ఉన్న రెం డు మున్సిపాలిటీలలో రాజకీయ వేడి మొదలైంది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున్న ఆశవహులు ఎన్నికల బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో కూడ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 13,905 మంది ఓటర్లు ఉన్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 51,205 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలలో వార్డుల ఓటరు జాబితా సవరణ కోసం అభ్యంత రాలను అధికా రులు స్వీకరిస్తున్నారు. ఈనెల 10న ఓటరు తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

మొట్టమొదటి సారిగా ఆసిఫాబాద్‌ మున్సిపాలి టీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వీటితో పాటు వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్ల కేటాయింపు ఏ విధంగా ఉంటుందని సర్వత్ర చర్చ జరుగుతుంది. పోటిలో ఉండాలని బావిస్తున్న ఆశవహులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపా లిటీలోను రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి రిజర్వేషన్లు ఎవరికి అనుకులిస్తాయోనని చర్చించుకుంటున్నారు. వార్డుల్లో రిజర్వేషన్ల కేటా యింపుపై ఉత్కంఠ నెలకొంది. కాగా మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉండగా ఆయా మున్సిపాలిటీలను కైవసం చేసుకు నేందుకు ప్రధాన పార్టీలు వ్యూహలు రచిస్తున్నా యి. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయంతో మున్సిపాలిటీ పోరులో కూడ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలి టీలో 20 వార్డులు, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా ఆయా వార్డులకు కౌన్సిలర్లుగా ఎవరిని బరిలో దించాలని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు కౌన్సిల ర్లుగా పోటీ చేసేందుకు ఆశవహలు ఆదినాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకే అవకాశం కల్పిం చాలంటూ నాయకుల వద్దకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల నేప థ్యంలో పట్టణాల్లో రాజకీయ సందడి నెలకొంది.

Updated Date - Jan 06 , 2026 | 10:14 PM