kumaram bheem asifabad- అంగన్‌వాడీ కేంద్రంలో ఉడిపడ్డ పైకప్పు పెచ్చులు
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:09 PM
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్ పెచ్చులు ఉడిపడి ఐదుగురికి గాయాలైన సంఘటన మంగళవారం మండలంలోని అంకుసాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి రోజు మాదిరిగానే తల్లులు తమ పిల్లలను తీసుకువచ్చారు. మధ్యాహ్నం బోజనం చేస్తున్న సమయంలో స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఉడిపడ్డాయి.
ఆసిఫాబాద్‌రూరల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్ పెచ్చులు ఉడిపడి ఐదుగురికి గాయాలైన సంఘటన మంగళవారం మండలంలోని అంకుసాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి రోజు మాదిరిగానే తల్లులు తమ పిల్లలను తీసుకువచ్చారు. మధ్యాహ్నం బోజనం చేస్తున్న సమయంలో స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఉడిపడ్డాయి. హరిత, స్వాతిక, సాయిల అనే చిన్నారులతో పాటు వారి వెంట వచ్చిన తల్లులు సంగీత, సోనీలకు తలపై స్లాబ్ పెచ్చులు పడటంతో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న సర్పంచ్ టేకం గంగారాం, గ్రామస్తులు వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో హరిత, స్వాతిక, సాయి, సోనీలకు ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. తీవ్ర గాయపడిన సంగీతను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కలెక్టర్ హరిత హుటహుటిన ఆసుపత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గాయాల తీవ్రత ప్రస్తుతం అందిస్తున్న చికిత్స వైద్య పరీక్షలు తదితర ఆంశాలపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భవనాల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన మరమ్మత్తులు భద్రతచర్యలు చేపట్టాలని సంబందిత అధికారులను అదేశించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ ఉన్నారు.