Share News

kumaram bheem asifabad- చిట్టి చిలుకమ్మ.. చిత్రాల మొలకమ్మా

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:23 PM

సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో ప్రతి రంగంలో వీటి వినియోగం పెరుగుతోంది. ఇంటర్‌నెట్‌ అందరికి అందుబాటులో రావడంతో పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా సెల్‌ఫోన్‌పై చిన్నారులు మక్కువ చూపుతున్నారు. ప్రతి ఇంట్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అందుబాటులోని యాప్స్‌ వినయోగించుకుని చదవడం, పద్యాలు వినడం, పాడటం సులువుగా నేర్చుకోవచ్చు.

kumaram bheem asifabad-  చిట్టి చిలుకమ్మ.. చిత్రాల మొలకమ్మా
లోగో

- వేసవి సేలవుల్లో సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనం

వాంకిడి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో ప్రతి రంగంలో వీటి వినియోగం పెరుగుతోంది. ఇంటర్‌నెట్‌ అందరికి అందుబాటులో రావడంతో పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా సెల్‌ఫోన్‌పై చిన్నారులు మక్కువ చూపుతున్నారు. ప్రతి ఇంట్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అందుబాటులోని యాప్స్‌ వినయోగించుకుని చదవడం, పద్యాలు వినడం, పాడటం సులువుగా నేర్చుకోవచ్చు. చిన్నతనంలోని పిల్లలకు అనుకరణ శక్తి ఎక్కువగా ఉండడంతో వివిధ రకాల యాప్స్‌ ద్వారా తొందరగా అక్షరాలు, సంఖ్యలు, పద్యాలు నేర్చుకునే అవకాశం ఉంది. వేసవి సెలవుల్లో తల్లిదం డ్రులు చిన్నారులకు ఇంట్లోనే సొంతంగా బోధన చేసే వీలుంది. ఈ సందర్భంగా ఎక్కువగా వినియోగంలోఉన్న చిన్నారుల యాప్స్‌ గురించి తెలుసుకుందాం..

- వివిధ భాషల్లో అక్షరమాల..

హిందీ, ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం, ఇలా రకరకాల భాషల్లో యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అక్షరమాల, అచ్చులు, హల్లులు, అభ్యసించడం, వినడం, రాయడం, చదవడం చేయవచ్చు. పూర్వ ప్రాథమిక తరగతుల చిన్నారులకు ఇలాంటి పాఠాలు ఉపయోగ కరంగా ఉంటాయి. దీనికోసం యాప్స్‌లో లెర్న్‌ ఏబీసీ, లేదా ఆల్ఫాబిట్‌ బోర్డ్‌ టైప్‌చేసి చరవాణిలోకి ఆప్‌లోడు చేసుకోవచ్చు.

- జంతువులు..పక్షులు..

చిన్నారులకు జంతువులు, పక్షులు సమస్తం పరిచయం అవుతుంటాయి. వాటిని గుర్తించి ఏ పేరుతో పిలువాలో పిల్లల్లో అయోమయం ఉంటుంది. చరవాణి యాప్స్‌ లో జంతువులు, పక్షులు, కీటకాలు కనిపిస్తూ వాటి హావాభావాలు వ్యక్త పరుస్తుంటాయి. జంతువు ఎలా ఉంటుందో, పక్షి ఎలా అరుస్తుందో జీవరాశుల పేర్లు, వాటి మనుగడ కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి, చిన్నారులు రకరకాలైన జీవులను గుర్తించేందుకు అనుకూలమైన ఎనిమల్‌ లేదా బర్డ్స్‌ యాప్‌లోకి వెళితే మొత్తం జీవరాశుల వివరాలు వస్తాయి.

- పదాల అనుకరణ..

అక్షరమాల తర్వాత చిన్నారులు పదాలను అనుకరిస్తారు. తెలుగులో అ-అమ్మ, ఆంగ్లంలో ఏ ఫర్‌ యాపిల్‌ నుంచి అక్షరాలకు పదాలు సమకూరుస్తారు. యాప్‌లో పలికే విధానంతో పిల్లలు త్వరగా గ్రహించి అనుకరించే అవకాశం ఉంటుంది. పదాల నిర్మాణం పద్యాల రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి.

నీతికథలు..

చిన్నతనంలో పిల్లలకు ఇంట్లోని నాన్నమ్మ, తాతలు పిట్ట కథలు, నీతి కథలు చెబుతూ అందు లోని మంచీ చెడును వివరించే వారు. నేటి కాలంలో కుటుంబ బాందవ్యాలు తగ్గుతూ ఉద్యోగాలు, చదువులతో సొంతూర్లకు దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి వ్యవస్థ తగ్గి చిన్నకుటుంబాలుగా మారటంతో చిన్నారులకు మంచి చెడు గురించి నీతి కథలు చెప్పేవారు కరవయ్యారు. సాంకేతిక పరమైన అభివృద్ది సాధించగా చరవాణిలో సైతం ఇలాంటి కథలు వినేందుకు లర్న్‌ చైల్డ్‌ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. గణితంలో అంకెలు, సంఖ్యల తర్వాత ప్రధానమైనవి చతుర్విద ప్రక్రియలే. ఇవన్నీ నేర్చుకోవటానికి యాప్స్‌లో అందుబాటులో ఉంచారు. గణితంలో వెనకబడిన చిన్నారులు సులభంగా నేర్చుకునే పద్దతులు ఇందులో ఉన్నాయి. 1, 2, 3 ఇలా మొదలుకొని వందల వరకు అంకెలు, సంఖ్యలు, యాప్స్‌లో ఉన్నాయి. తెలుగులో అంకెలు రాయడం, చదవడం, అనుకరించడం...ఆంగ్లంలో అంకెలు రాయటం, వినటం, అనుకరించటం వంటివి చూడొచ్చు.

చిత్రలేఖనం..

చిన్నారులు ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయడంపై మక్కువ చూపుతారు. అందులో మెరుగైన శిక్షణ ఇప్పిస్తే మరింత రాణిస్తారని తెలిసినా చాలా మంది తల్లిదండ్రులు సమయం లేపోవడంతో పట్టించుకోరు. చేతిలో కళ ఉన్నా నిరాధారనకు గురవుతున్నారు. చిన్నారులు జంతువుల ఆకారాలు, బొమ్మలు గీయడం, అనుకరిచడం డ్రాయింగ్‌ యాప్స్‌తో సులువుగా నేర్చుకునే వెసులుబాటు ఉంది.

అనువుగా ఆంగ్లం..

ఆంగం్ల అంటేనే తెలుగు మాద్యమం విద్యార్థుల్లో సహజంగా భయాందోకళన ఉంటుంది. ఆంగ్లంలో పట్టు సాధించేందుకు చదవాలన్నా, రాయాలన్నా, ఇబ్బందులు పడుతుంటారు. అందుబాటులోని సువువైన ఆంగ్లంతో భాషపై పట్టు సాధించడంతో పాటుగా మార్కులు ఎక్కువగా తెచ్చుకునే అవకాశం ఉంది. లెర్నింగ్‌ ఇంగ్లీష్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే గ్రామర్‌తో పాటు అనుకరణ సులభంగా నేర్చుకోవచ్చు. ఇలాంటి అనేక రకాల యాప్స్‌లు సెల్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు అనుకూలమైన యాప్స్‌లను చరవాణిలో డౌన్‌లోడ్‌ చేసుకోని తీరికసమయంలో ఇంట్లోనే పిల్లలకు చదువు నేర్పిచవచ్చు. చిన్నపిల్లల తల్లి తండ్రులు ఇలాంటి యాప్స్‌లను సద్వినియోగం చేసుకుంటే చిన్నపిల్లలకు ఎంతో ఉపయోగం కరంగా ఉంటాయి.

చిన్నారులు బయటకు వెళ్లకుండా..

- వడ్లూరి రాజేష్‌ ఉపాధ్యాయుడు వాంకిడి

ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా చిన్నారులు చరవాణిలో , ల్యాప్‌ట్యాప్‌లో విద్యకు సంబంధించిన ఆటాపాటలను నేర్చుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఎండలు తగ్గపోయిన తర్వాత శారీరక ఆటలు ఆడుకోవాలి. చరవాణిలో గంటల తరబడి సంబంధంలేని అంశాలు చూసుకుంటూ కాలక్షేపం చేయడం మంచిదికాదు. చదువులకు సంబంధించిన అంశాలను మాత్రమే వినియోగించుకుంటే ఉపయోగంగా ఉంటుంది.

Updated Date - Apr 18 , 2026 | 11:23 PM