ప్రశాంత వాతావరణంలో మెరుగైన నివాసాలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:31 AM
రాజేంద్రనగర్ గగన్‌పహాడ్‌లో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన నివాస ప్రాజెక్టు ఎకోరైజ్‌కు ఆదివారం శ్రీకారం చుట్టారు.
ఎకోరైజ్ ప్రాజెక్టును ప్రారంభించిన చిన జీయర్‌స్వామి
రాజేంద్రనగర్‌లో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ప్రారంభం
రాజేంద్రనగర్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్ గగన్‌పహాడ్‌లో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన నివాస ప్రాజెక్టు ఎకోరైజ్‌కు ఆదివారం శ్రీకారం చుట్టారు. త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి మంగళాశాసనాలతో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ అందరూ మంచి ఇల్లు కోరుకుంటారని అన్నారు. అయితే ప్రశాంతతను అందించే వాతావరణం కలిగిన ఇళ్ల నిర్మాణమే ముఖ్యమన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రకృతి సౌందర్యం, ఆధునిక సౌకర్యాల సమ్మిళితంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందన్నారు. 5.24 ఎకరాల విస్తీర్ణంలో 516 యూనిట్లతో తక్కువ జనసాంద్రతతో ఉండేలా ప్రణాళిక రచించామన్నారు. 100శాతం వాస్తుతో 3, 4 బీహెచ్‌కే ప్లాట్లు... 2,250 నుంచి 4,695 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రాజెక్టులో పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ 1.2 ఎకరాలలో ల్యాండ్ స్కేపింగ్, 33 వేల చదరపు అడుగుల స్కై గార్డెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా 57 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్ 7అంతస్తులతో గ్రాండ్ క్లబ్ హౌస్ నిర్మిస్తున్నామన్నారు.