చిన జీయర్ స్వామి క్షమాపణ చెప్పాల్సిందే
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:42 AM
ఆదిశంకరాచార్యులపై చిన జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని అమరావతిలోని శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి చెప్పారు.
ఆదిశంకరాచార్యులపై జీయర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం
హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం తగదు
శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి కన్నెర్ర
పంజాగుట్ట, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఆదిశంకరాచార్యులపై చిన జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని అమరావతిలోని శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి చెప్పారు. చిన జీయర్ స్వామిని తాము గౌరవిస్తామని, అయితే ఆయన వ్యాఖ్యలను తిరస్కరిస్తామన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో శివ స్వామి మా ట్లాడుతూ హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం తగదన్నారు. వైష్ణవులు, శైవుల మధ్య తగాదా ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చిన జీయర్ స్వామి నుంచి సమాధానం రాకపోతే ఆయనను ప్రశాంతంగా ఉండనివ్వమన్నారు. మరోవైపు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే అంశాన్ని హిందూ ధర్మంపై దాడిగా పరిగణిస్తున్నామని శివ స్వామి చెప్పారు. ఈ అంశంపై లడ్డూ కల్తీపై నిజాలు నిగ్గు తేల్చడానికి ఏక సభ్య కమిటీ ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు.