kumaram bheem asifabad- బడుల్లో...బాలల సంఘాలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:06 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చదు వుతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు, క్రమశిక్షణ అలవర్చుకునేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో బాలల సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే సంఘాలు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఉన్నతాధికారుల సూచనతో తొమ్మిది అంశాలపై సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు.
బెజ్జూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చదు వుతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు, క్రమశిక్షణ అలవర్చుకునేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో బాలల సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే సంఘాలు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఉన్నతాధికారుల సూచనతో తొమ్మిది అంశాలపై సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా పాఠశాలల్లో సంఘాల ఏర్పాటుతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందడంతో పాటు విద్యార్థుల గైర్హాజరుకు కారణాలను ఉపాఽ ద్యాయులు తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. విద్యార్థులు తమ హక్కులు తెలుసుకు నేందుకు దోహదపడతాయి. వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను, ప్రతిభను వెలి కితీసే వీలుంటుంది. చట్టాలు, సమాజం, వివిద వ్యవస్థలపై అవగాహన ఏర్పడుతుంది.
ప్రధాన అంశాలివే..
విద్యార్థుల హాజరు శాతం, ఇందులో మళ్లీ(విద్యార్థులతో పాఠశాల మాజరు కమిటీ, విద్యార్థులతో తరగతి వారి హాజరు కమిటీ, విద్యార్థి తల్లులతో హాజరు కమిటీ) మూడు ఉపసంఘాలు ఉంటాయి. ప్రయోగశాల నిర్వహణ, గ్రంథాలయం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంకేతికత వినియోగం, సృజనాత్మకత, పచ్చదనం-పరిశుభ్రత, సురక్షిత పాఠశాల, సమాజ భాగస్వామ్యం ఇందులో ప్రధాన అంశాలుగా ప్రభుత్వం చేకూర్చింది. అయితే ఆయా పాఠశాలల్లో ఈ సంఘాలను గ్రామపంచాయతీ సర్పంచ్, కార్యదర్శి, పాఠ శాల యాజమాన్య కమిటీల ఆద్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబం ధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.