kumaram bheem asifabad- ఘనంగా బాలల దినోత్సవం
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:21 PM
మండలంలో శనివారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు స్వయం పాలన నిర్వహించారు.
బెజ్జూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు స్వయం పాలన నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠ్యాంశాలు బోధించారు. ఈ సందర్బంగా నెహ్రూ స్వాతంత్య్ర ఉధ్యమంలో పాల్గొన్న తీరు, ఆయన చేసిన పోరాటం గురించి విద్యార్థులకు వివరించారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): పట్టణంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని నెహ్రూ పుట్టన రోజు సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. ఎస్పీఎం సీఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉట్‌పల్లి గిరిజన గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు చిత్రలేఖన పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్, ఉపాధ్యాయులు అంజలి, స్పార్ష్ సోషల్ ఫౌండేషన్ ప్రతినిధులు, సుశీల, శివకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వయం పరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు బాలల దినోత్సవ ఆవశ్యకతన వివరించారు. ఈ సందర్భంగా వివిధ వకృత్వ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామ పంచాయతీల్లో, పాఠశాలల్ల్లో దేశ తొలి ప్రధాని పండిట్ జవహార్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో బాలల గ్రామ సభలు నిర్వహించి పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు ఎదుక్కొంటున్నా సమస్యలపై చర్చించి నివేదికలు తయారు చేశారు. పాఠశాలల్లో క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వాంకిడి పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకొన్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని కసూర్బాగాంధీ విద్యాలయ, జిల్లా పరిషతఖ పాఠశాలాలో, ఘునూర్ కే మండలంలోని తదితర పాఠశాలలో జవహర్‌లాల్‌నెహ్రూ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంఈవో శ్రీనివాస్, కసూర్బాగాంధీ విద్యాలయ, ప్రత్యేకాధికారి మీన తదితరులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఆయా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పండిత్ జవహార్ లాల్ నెహ్రూ వేషాదారణ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా క్విజ్, క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీలు, ఆయాలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్, (ఆంధ్రజ్యోతి): మండలంలో ఉన్నత పాఠశాలలో శనివారం బాలల దినత్సోవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధిని విద్యార్థులు వివిధ సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు భాష, ఉపాధ్యాయులు సంతోష్, భాగ్య శ్రీ, మౌనిక, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం గోలేటి టౌన్ పిష్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలను నిర్వహించారు. అనంతరం పీవో శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవితేజ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌కమిటి ఛైర్మన్ సిద్దాల దేవయ్య మాట్లాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ డబ్బా గోపాలీ్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఉపాధ్యాయలు విద్యార్థులు పాల్గొన్నారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సోన్‌పేట్ ఉర్డూ మీడియం పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త మాజీ వార్డు సభ్యుడు ఎండీ ఇప్ఫత్ హుస్సేన్ తన సొంత ఖర్చుతో పిల్లలకు నోట్ బుక్స్, పెన్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంల ప్రధానోపాధ్యాయు కాఫీల్ అహ్మద్, ఉపాధ్యాయురాలు ఫర్హానాజ్, హాఫీజ్, ఆరీఫ్, అబ్దుల్, జమీల్ పాల్గొన్నారు.