పిల్లలు ఆటపాటల్లో రాణించేలా చూడాలి
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:36 AM
పిల్లలు చదువుతో పాటు ఆటల్లో రాణించేలా చూడాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి ప్రభుత్వ పాఠశాల అవరణలో మహిళ శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖాల అధ్వర్యంలో
తంగళ్లపల్లి, ఏప్రిల్ 27 (ఆంఽధ్రజ్యోతి): పిల్లలు చదువుతో పాటు ఆటల్లో రాణించేలా చూడాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి ప్రభుత్వ పాఠశాల అవరణలో మహిళ శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖాల అధ్వర్యంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలను నిర్వహించారు. విద్యార్ధులకు ఆటల పరికరాలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లడుతూ పది శాఖల అధ్వర్యంలో మార్చి 6వ తేదీ నుంచి జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల భద్రత, అభివృద్ధి భాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనని అన్నారు. కుటుంబ రక్షణ కోసం వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అంగన్‌వాడి కేంద్రాలకు నీటి శుద్ధి యంత్రాలు, ఆట పరికరాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండా లని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మిరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, తహశీల్దార్ విజ య ప్రకాశ్‌రావు, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్, సీడీపీవో ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.