kumaram bheem asifabad- పిల్లలు.. పదిలం
ABN , Publish Date - Nov 06 , 2026 | 10:31 PM
రంగురంగుల వెలుగులు చిమ్మే బాణాసంచ, ఇళ్ల మంగింట్లో వరుసలుగా పేల్చిన దీపాలతో కనిపించే పాండుగ దీపావళీ. ప్రతీ ఇంటి ముందు పచ్చని తోరణాలు, వీధుల్లో ఎక్కడ చూసినా బాణాసంచా సందడి కనిపిస్తుంది. జీవితంలో అందరికి విజయాలు దక్కాలన్నది ఈ పండుగ అందించే సందేశం. కుటుంబమంతా ఆనందోత్సవాల నడుమ లక్ష్మి పూజలతో పాటు టపాసులు కాల్చుతూ జరుపుకునే దీపావళి సరదా సరదాగా గడిచిపోతుంది.
- తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
వాంకిడి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రంగురంగుల వెలుగులు చిమ్మే బాణాసంచ, ఇళ్ల మంగింట్లో వరుసలుగా పేల్చిన దీపాలతో కనిపించే పాండుగ దీపావళీ. ప్రతీ ఇంటి ముందు పచ్చని తోరణాలు, వీధుల్లో ఎక్కడ చూసినా బాణాసంచా సందడి కనిపిస్తుంది. జీవితంలో అందరికి విజయాలు దక్కాలన్నది ఈ పండుగ అందించే సందేశం. కుటుంబమంతా ఆనందోత్సవాల నడుమ లక్ష్మి పూజలతో పాటు టపాసులు కాల్చుతూ జరుపుకునే దీపావళి సరదా సరదాగా గడిచిపోతుంది. బాణాసంచా కాల్చడానికి వయోభేదం లేకుండా అంద రూ ఉత్సాహం చూపిస్తారు. మొదట్లో దీపాల వెలుగులకే పరిమితమైన పండుగ నేడు టపాసులు, పెద్దపెద్ద శబ్దాలు, కంటికి హాని కలిగించే కాంతులతో బీభత్సంగా మారింది. టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది.
- భారీ శబ్దాలు..
టపాసులు పేల్చినప్పుడు వెలువడే ధ్వని అపరిమితమైంది. భారీ శబ్దాలను పట్టించే హైడ్రోజన్ టపాసులు వివిధ పేర్లతో అందుబాటులో ఉన్నాయి. యువత వీటినే ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ వాటిద్వారా వెలువడే శబ్దాలతో వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. టపాసులు కాల్చేటప్పడు చేతులతో పట్టుకొని చిచ్చుబుడ్డులను కాల్చడం, టపాసులను కాల్చి విసరడం, అవి పేలలేదని దగ్గరకు వెళ్లి చూడటం ఎంతో ప్రమాదం. తక్కువ శబ్దం వచ్చే కాకరొత్తులు తదితర రకాల టపాసులను కాల్చడం ఉత్తమం. ఇవన్నీ గుర్తించి దీపావళిని సంతోషంగా జరుపుకోవాలి. కాగా దీపావళి వేడుకల్లో సరదా, ప్రమాదం రెండు ఉన్నాయి. ముఖ్యంగా గుండే జబ్బుఉన్న వారు భారీ శబ్దాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడం ఉత్తమం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హైడ్రోజన్ బాంబులు భారీ శబ్దాలు రావడంతో గుండే జబ్బులు ఉన్న వారికి ఇబ్బంది తలపెడుతుంది. అదే విధంగా పసిపిల్లలు, వృద్దులు టపాసులు కాల్చే సమయంలో దూరంగా ఉండాలి. దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. లేని పక్షంలో ప్రమాదాన్ని కోరితెచ్చుకున్నట్లు అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పూరి గుడిసెలు, గడ్డి వాముల దగ్గర టపాసులను పేల్చకూకడదు. టపాసులు కాల్చే సమయంలో చిన్నారులను దూరంగా ఉంచాలి.
- కాటన్దుస్తులనే వాడాలి..
టపాసులు కాల్చే సమయంలో సిల్క్ దుస్తులు ధరించకూడదు. కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. నీరు అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో కాని, అపార్ట్మెంటులో కాని టపాసులు కాల్చకూడదు. విశాలమైన ప్రాంతంలో టసాసులు కాల్చాలి. టపాసులు కాల్చేసమయంలో కళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిచ్చుబుడ్లు, పాము బల్లలు, తదితర మెగ్నీషియం ప్రధానంగా తయారుచేస్తారు. దీపావళి అంటే టపాసులను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. వాటిని కాల్చడానిఇక ఉత్సాహపడుతుంటారు. పెద్దలు దగ్గరుండి చిన్నారులతో వాటిని వెలిగించాలి. బిగుతైన దుస్తులు వేసి అగ్నిప్రమాదాలను నివారించవచ్చును. పొగ పీల్చు కోకుండా మాస్క్లు ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళి వచ్చిందంటే 15 రోజుల వరకు టపాసుల మోత తప్పదు. వాటి శబ్దం పక్కన పెడితే పొగ, నుసితో ఆస్తమా బాధితులు ఇబ్బంది పడుతుంటారు. ఆస్తా మాకు టపాసుల పొగ తోడవడంతో వారికి ఊపిరాడని పరిస్థితి ఎదురవుతుంది. వీరితో పాటు గర్భిణులు, వృద్దుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందవ్ల టపాసుల కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
- నిబంధనలు ఇవీ..
టపాసుల దుకాణాల ఏర్పాటుకు నిర్వాహకు లు అగ్నిమాపకశాఖ, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్శాఖల అనుమతి విధిగా తీసుకోవాలి. దుకాణాల ఏర్పాటుకు డివిజనల్ ఫైర్ ఆఫిసర్ నుంచి లైసెన్స్, ప్రభుత్వ స్థలం అయితే మున్సిపల్, గ్రామపంచాయతీల నుంచి అనుమతులు తీసుకోవాలి. ప్రైవేటు స్థలం అయితే స్థల యజమాని నుంచి ఎన్ఓసీ అవసరం. దుకాణాల మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలి. టపాసుల దుకాణాల వద్ద నాలుగు ఇసుక బకెట్లు, 200 లీటర్ల నీళ్ల డ్రమ్స్, రెండు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంచాలి.
లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి..
- మహేందర్, వాంకిడి ఎస్సై
బాణాసంచా విక్రయదారులు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకో వాలి. అనుమతి లేని, నిషేధిత బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్రయలు తీసుకుం టాం. దుకాణాల వద్ద అగ్నిమాపక పరికరాలు ఏర్పా టు చేసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ట పాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం.