Share News

kumaram bheem asifabad-బాల్యానికి పెళ్లి గండం

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:49 PM

జిల్లాలో ఏడేళ్లలో మందస్తు సమాచారం అందిన 165 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. బాల్యవివాహాల కారణంగా కలిగే అనార్థాలపై తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించి వాటిని ఆపగలిగారు. చేయిదాటిని కొన్ని ఘటనలపై ప్రొహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌- 2006 ప్రకారం అందుకు బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే అధికారుల దృష్టికి రాకుండా, వచ్చినా ఒత్తిళ్ల కారణంగా గుట్టుచప్పుడుకాకుండా జరుగుతున్న బాల్యవివాహాలు ఏటా వందల సంఖ్యలో ఉంటున్నాయని సమాచారం

kumaram bheem asifabad-బాల్యానికి పెళ్లి గండం
లోగో

- నేటి గ్రామసభల్లో బాల్య వివాహ రహిత గ్రామాల తీర్మానాలు

వాంకిడి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏడేళ్లలో మందస్తు సమాచారం అందిన 165 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. బాల్యవివాహాల కారణంగా కలిగే అనార్థాలపై తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించి వాటిని ఆపగలిగారు. చేయిదాటిని కొన్ని ఘటనలపై ప్రొహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌- 2006 ప్రకారం అందుకు బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే అధికారుల దృష్టికి రాకుండా, వచ్చినా ఒత్తిళ్ల కారణంగా గుట్టుచప్పుడుకాకుండా జరుగుతున్న బాల్యవివాహాలు ఏటా వందల సంఖ్యలో ఉంటున్నాయని సమాచారం

- గ్రామీణ ప్రాంతాల్లోనే..

బాల్య వివాహాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా జరుగుతున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం బాల్య వివాహాలు జరుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాంత వివాహాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బిసి, మాలీ, తేలీగాండ్ల కులస్తుల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సర్వేలు నివేదిస్తున్నాయి. బాల్య వివాహాలతో సంభవించే అనార్థాలను ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. మహిళా సంఘాలతో పాటు వివిధ సందర్భాల్లో బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ముమ్మర ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాయి. బాల్య వివాహాల సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ అధికారులు రంగంలో దిగుతున్నారు. బాలిక వయసు నిర్ధారించి కుంటుంబ సభ్యులతో మాట్లాడి ఆ వివాహాన్ని నిలిపివేస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులకు చట్టపర పరిణామాలతో పాటు బాలిక భవిష్యత్‌, ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఇటువంటి చర్యలు ఎంత మాత్రం బాల్యయ వివాహాలను పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నాయి. జిల్లాలో గడిచిన ఏడేళ్లలో 165 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారంటే సమస్య తీవ్రత తెలియచేస్తుది.

- గ్రామసభలకు కీలక బాధ్యత

బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామస్థాయి వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ మేరకు అక్టోబరు 2న దేశ వ్యాప్తంగా వికసిత్‌ భారత్‌ కోసం నిర్వహిస్తున్న గ్రామసభల్లో అభివృద్ది ప్రణాళికల ఆమోదంతో పాటు బాల్య వివాహాల రహిత గ్రామాలుగా ప్రకటించే తీర్మానాలను చేయాలని పిలపునిచ్చింది. అందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణాబివృద్ది శాఖ ద్వారా పరిషత్‌ అభివృద్ది అధికారులకు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం గ్రామ సభల్లో తీర్మానాలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

- జిల్లాలో ఏడేళ్లలో అధికారులు అడ్డుకున్న బాల్య వివాహాల వివరాలు..

---------------------------------------------------

2019 38

2020 29

2021 24

2022 23

2023 18

2024 15

2025 18

Updated Date - Oct 01 , 2026 | 10:49 PM