kumaram bheem asifabad- బాల్యానికి ‘బంధం’ వద్దు
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:12 PM
బాల్యానికి మూడు ముళ్ల బంధం వద్దని, బాల్య వివాహం చేసి వారి భవిష్యత్తును నాశనం చేయవ ద్దని అధికారులు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా జిల్లాలో అక్కడక్కడా బాల్య వివాహాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులకు తెలిస్తే వాటిని అడ్డుకుంటున్నారు.
- ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
బాల్యానికి మూడు ముళ్ల బంధం వద్దని, బాల్య వివాహం చేసి వారి భవిష్యత్తును నాశనం చేయవ ద్దని అధికారులు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా జిల్లాలో అక్కడక్కడా బాల్య వివాహాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులకు తెలిస్తే వాటిని అడ్డుకుంటున్నారు.
జైనూర్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బాల్య వివాహాల నియంత్రణపై సంబంధిత అధికారులు దృష్టి సారిం చారు. కమిటీలు అధికారులు దృష్టికి తీసుకొచ్చిన వాటిని నిలుపుదల చేస్తున్నా.. పలు చోట్ల ఇవి జరుగుతున్నాయి. పెళ్లి కుదిరిన వారిలో చిన్నారులు ఎక్కడైన ఉన్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో గత నెలలో ముగ్గురు మైనర్లకు వివాహం జరిపించేందుకు సిద్ధం కాగా బాలల సంరక్షణ అధికారులు గుర్తించి నిలువరించారు. ఆడ పిల్లలను భారంగా భావించడం, ఆర్థిక పరిస్థితులు ..ఇలా కారణమేదైనా ఇంకా అక్కడక్కడా వివాహాలు చేస్తు న్నారు. ఇలాంటి వాటికి తావు లేకుండా కేంద్ర ప్రభు త్వం బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సుస్థిరాభివృధ్ధి లక్షాలు 2030 ప్రధాన అంశాల్లోను బాల్య వివాహ నిర్మూలనే మొదటి లక్ష్యంగా పేర్కొన్నారు.
- బాల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో..
జిల్లా బాల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఐసీడీ ఎస్, ఇతర శాఖలతో కలిసి గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 335 పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీకి చైర్మన్ సర్పంచ్, కన్వీనర్‌గా అంగన్‌వాడీ టీచర్ ఉంటారు. సభ్యులుగా ఏఎన్‌ఎం, పాఠశాల ఉపాధ్యాయుడు, బాలల తల్లిదండ్రుల నుంచి ఒకరు, యువజన, మహిళా సంఘం, స్వఛ్ఛంద సంస్థలు బాలల సంఘాల నుం చి ఇద్దరు, గ్రామ పోలీసు, జీపీవో, కార్యదర్శి మత పెద్దలు ఉంటారు. ఇలా మండల, జిల్లా స్థాయిలోను కమిటీ లు ఏర్పాటు చేశారు. గ్రామ కమిటీలు క్షేత్ర స్థాయి లో పరిశీలించాలి. బాలల హక్కుల రక్షణ బాల్య వి వాహాలు జరగకుండా చూడడం, బాల్య వివాహాల తో కలిగే అనార్థాలు, భవిష్యతులో ఎదరు రయ్యే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తారు.
చట్టం ఏం చెబుతుందంటే..
బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతిం చ కూడదు. వాస్తవంగా బాలిక వయస్సు 18, యువకుడి వయస్సు 21 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాల్సి ఉంటుంది. ఈ వయస్సు లోపల చేస్తే మాత్రం బాల్యవివాహాల కిందకు వస్తాయి. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్టు 2006(పీసీఎంఎ) కింద బాల్యవివాహాన్ని నిర్వహించిన వారికి, ప్రోత్సహించిన వారికి, అనుమతించిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఆధారాలు పక్కాగా రుజువయితే రెండేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా కూడా విధించే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
- ఇవీ అనర్థాలు..
బాల్య వివాహాలు చేయడం వల్ల ఎన్నో రకాల అనర్థాలు తలెత్తుతున్నాయి. బాలికలు రక్తహీనతకు గురికావడం, అనారోగ్యకర శిశువులకు జన్మనివ్వడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. సరైన అవగా హన లేక కలహాలు ఏర్పడి విడాకులు తీసుకునేవ రకు పరిస్థితులు వెళుతున్నాయి. యుక్త వయస్సు రాక ముందే వివాహం చేయడం వల్ల చదువు కొనసాగించే అవకాశం కోల్పోతున్నారు. బాలికల మానసిక పరిస్థితి గందరగోళంగా మారుతోంది. గృహ హింసకు గురవుతున్నారు. ప్రసూతి మరణా లు సైతం సంభవిస్తున్నాయి.
అవగాహన కల్పిస్తున్నాం..
- ఇందిర, సీడీపీవో
పెళ్లిళ్ల సీజన్ మొదలవ్వడంతో ఐసీడీఎస్ ఆధ్వ ర్యంలో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తు న్నాం. బాల్య వివాహాలను అరికట్టడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. సంబంధిత అంగన్‌వాడీ లకు బాల్య వివాహాలు జరగకుండా చూడాలని ఆదే శించాం. ఎక్కడైనా బాల్య వివాహాలు నిర్వహిం చినట్లు ప్రజలు గుర్తిస్తే మాకు సమాచారం ఇవ్వాలి.. బాల్య వివాహలు నిర్వహిస్తే పురోహితులు, ఖాజీలు వధూవరుల కుటుంబాల సభ్యులు సైతం బాధ్యులు అవుతారు.