అత్యాచారం కేసులో ముద్దాయికి 25 ఏళ్ల జైలు
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:09 AM
బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ 12వ అదనపు సెషన్స్ జడ్జి అనిత తీర్పు చెప్పారు.
బేగంపేట, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ 12వ అదనపు సెషన్స్ జడ్జి అనిత తీర్పు చెప్పారు. 2023లో బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్టు కేసు నమోదయింది. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ హబీబ్ (53)కు పాతికేళ్ల కఠిన కారాగారవాసంతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం కూడా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారని ఇన్‌స్పెక్టర్ పి. సైదులు తెలిపారు.
అత్యాచార యత్నం కేసులో అయిదేళ్ల శిక్ష
మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసినందుకు నిందితుడికి అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నాంపల్లిలోని పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఉదయభాస్కర్ తీర్పు ఇచ్చారు. రసూల్‌పురకు చెందిన అతి సుధాకర్(40)కు ఈ శిక్ష విధించారు. బాధితురాలికి రూ.రెండు లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు.