kumaram bheem asifabad- బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ABN , Publish Date - Feb 14 , 2026 | 10:02 PM
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణాధికారి మహేష్ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రమాణికులకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి భాస్కర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా బాలల సంరక్షణాధికారి మహేష్ ఆధ్వర్యంలో బేటీ బచావో- బేటీ పడావోపై అవగాహన కల్పించారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణాధికారి మహేష్ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రమాణికులకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి భాస్కర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా బాలల సంరక్షణాధికారి మహేష్ ఆధ్వర్యంలో బేటీ బచావో- బేటీ పడావోపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం వల్ల బాలికలకు కలిగే అనర్థాల గురించి హక్కుల గురించి హెల్ప్ లైన్‌పై ప్రయాణ ప్రాంగణంలో ఉన్న ప్రయాణి కులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు జరిగితే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీసు హెల్ప్‌లైన్ 100కు ఫోన్ చేసి తెలుపవచ్చని సూచించారు. తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. బాల్య వివాహాలు చేయకూడదని చెప్పారు. బాల్య వివాహాలు జరిపిస్తే చట్ట ప్రకారం శిక్ష అర్హులు అవుతారని ఈ నాటక రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ప్రయాణి కులకు అంకూర్ వీడియో, రాజేష్ కన్నా కళాబృందం వారితో ప్రత్యేక కళాకారులతో నాటక రూపంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ విభాగం సభ్యులు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, శారద, రాజేశ్వరి, సంతోష్, ప్రభు పాల్గొన్నారు.