ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్, కేటీఆర్ చేయించిందే: చికోటి
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:30 AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయించిందేనని బీజేపీ అధికార ప్రతినిధి...
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయించిందేనని బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం ఆయనను సిట్ బృందం సుమారు గంటన్నర పాటు ప్రశ్నించి, స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. విచారణ అనంతరం మాట్లాడుతూ.. సిట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్నారు. తాను 200 ఫోన్లు ట్యాప్ అయ్యాయేమో అనుకున్నానని, కానీ జాబితా రెండు వేలకుపైగా ఉందని అర్థమైందని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, ఆ పార్టీ ఎమ్మెల్యేల భార్యలు, పనిమనుషులకు సంబంధించిన ఫోన్లను కూడా వదలలేదని వెల్లడించారు. తనపై ఈడీ విచారణ జరగడానికి ముందు నుంచే తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, దీనిపై గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.