Share News

చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయ ఈవో రామాంజనేయులుపై వేటు

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:45 AM

చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కే రామాంజనేయులును సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. సోమవారం దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ...

చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయ ఈవో రామాంజనేయులుపై వేటు

  • ఆలయ అభివృద్ధి పనుల్లో తీవ్ర అవకతవకలు

  • భక్తులు ఇచ్చిన ఆభరణాలపై లెక్కలు లేవు

  • ప్రసాదాల కొలతల్లోనూ అక్రమాలు

  • తనిఖీల్లో దేవాదాయశాఖ కమిషనర్‌ గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో కే రామాంజనేయులును సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. సోమవారం దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు అవకతవకలు గుర్తించి ఈవోను వెంటనే సస్పెండ్‌ చేశారు. అలాగే దేవాలయానికి దాతలు ఇచ్చిన బంగారు, వెండి ఆభరణాలపై సరైన జవాబుదారీతనం లేకపోవడాన్ని తనిఖీల్లో హనుమంతరావు గుర్తించారు. ఓ భక్తుడు స్వామివారికి సమర్పించుకున్న 2.30 కిలోల వెండి కిరీటానికి సంబంధించి రసీదు ఆయనకు ఇవ్వకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. సదరు కిరీటాన్ని మార్పు చేయడం కోసం కంసాలికి ఇచ్చి నాలుగేళ్లు గడిచినా తిరిగి తీసుకురాలేకపోయినట్లు గుర్తించారు. సదరు భక్తుడు ఆ కిరీటం గురించి అడిగితే ‘నేను నీకు రసీదు ఇవ్వలేదు. కాబట్టి నాకు బాధ్యత లేదు’ అంటూ ఈవో రామాంజనేయులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు విచారణ సందర్భంగా తేలింది. ఆలయంలో భక్తులకు స్వామివారి ప్రసాదంగా ఇస్తున్న పులిహోర, లడ్డూ నిర్ణీత పరిమాణం, కొలతలకన్నా తక్కువగా ఇస్తున్నట్లు, ఆలయానికి అద్దె ఆదాయానికి సంబంధించి ఎలాంటి లెక్కల నిర్వహణ లేదని గుర్తించారు.

Updated Date - Apr 14 , 2026 | 04:45 AM