పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి
ABN , Publish Date - May 19 , 2026 | 11:18 PM
పేదల ఆరోగ్యంపట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
వెల్దండ, మే 19 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆసరాగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పెద్దాపూర్ గ్రామానికి చెందిన గంగపురం చిన్నయ్యకు రూ.60వేలు, కాటిక శ్రీశైలంకు రూ.39వేలు, కొమ్మగోని జ్యోతికి రూ.11వేలు ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరుకాగా ఆ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మె ల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమళ్ల కృష్ణ ఉన్నారు.