Share News

కిలో చికెన్‌ రూ.325

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:24 AM

హైదరాబాద్‌లో చికెన్‌ రేటు అమాంతం పెరిగింది. శనివారం కేజీ చికెన్‌ (స్కిన్‌లెస్‌) ధర రూ.325కి చేరింది. ఇక, నాటు కోడి అయితే కిలోకు రూ. 750-రూ.800 మధ్య ఉంది.

కిలో చికెన్‌ రూ.325
Chicken Rate

  • నాటు కోడి అయితే రూ.750-రూ.800.. రికార్డు స్థాయికి రేటు

  • దిగుమతి తగ్గడం,ఎండలు పెరగడం వల్లనే

  • హైదరాబాద్‌లో తగ్గిన చికెన్‌ అమ్మకాలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో చికెన్‌ రేటు అమాంతం పెరిగింది. శనివారం కేజీ చికెన్‌ (స్కిన్‌లెస్‌) ధర రూ.325కి చేరింది. ఇక, నాటు కోడి అయితే కిలోకు రూ. 750-రూ.800 మధ్య ఉంది. 4రోజులుగా చికెన్‌ రేట్లు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కోళ్ల దిగుమతులు తగ్గడం, ఎండలు ముదరడం, ఎండ వేడికి కోళ్లు చనిపోతుండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. చికెన్‌ రేటు రూ.325కి పెరగడం ఇదే మొదటిసారని, గతంలో ఎప్పుడూ ఇంత ధర లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజూ 10వేల టన్నుల చికెన్‌ను విక్రయిస్తుంటారని అంచనా. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్‌ పండుగల సమయంలో రోజుకు 15-16 వేల టన్నులు అమ్ముతుంటారు. హైదరాబాద్‌లో హోల్‌సేల్‌ చికెన్‌ వ్యాపారులతో పాటు చిన్న చిన్న దుకాణాదారులు వారం, పదిరోజులకు సరిపడా కోళ్లను కొని పెట్టుకొని చికెన్‌ విక్రయిస్తుంటా రు. ఎండలు బాగా ముదరడంతో వీరి దగ్గర ఉన్న కోళ్లు చనిపోతున్నట్లు తెలిసింది. మరోవైపు, హైదరాబాద్‌, శంషాబాద్‌, షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని పౌలీ్ట్ర ఫారాల నుంచి ఏపీకి చెందిన కొందరు వ్యాపారు లు కోళ్లను పెద్ద ఎత్తున కొనుక్కొని వెళ్తుండటంతో హైదరాబాద్‌లో కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్‌లో ని వ్యాపారులు తమవద్ద ఉన్న కోళ్లను రేట్లు పెంచి అమ్ముతున్నారన్న వాదనలు ఉన్నాయి.


చేపల వైపు మొగ్గు

రేటు భారీగా పెరగడంతో సామాన్యులు చికెన్‌ కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో చికెన్‌ అమ్మకాలు భారీగా తగ్గాయి. అమ్మకాలు నాలుగు రోజులుగా 30-40 శాతం వరకు అమ్మకాలు పడిపోయినట్లు తెలుస్తోంది. చాలామంది చేపలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.


ఒకే రోజు 5వేలకు పైగా కోళ్లు మృతి

మెదక్‌ జిల్లా ‘కౌడిపల్లి’లో వైరస్ వ్యాప్తి

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం బురుగడ్డ గ్రామంలో అంతుచిక్కని వైరస్‌ సోకి భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెం దడం ఆందోళనకరంగా మారింది. బాధిత రైతు లిం గోళ్ల ప్రవీణ్‌ వివరాల ప్రకారం.. తన పౌల్ట్రీ ఫాంలో 7 వేల కోళ్లను పెంచుతున్నారు. 24 రోజుల క్రితం ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన కోడి పిల్లలను ఫాంలో వేశారు. వారం రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటివరకు వెయ్యి కోళ్లు చనిపోగా.. శనివా రం ఒక్కరోజే 5వేలకు పైగా మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చివేశారు. మండలంలోని పలు పౌల్ట్రీ ఫామ్‌లలో నెల రోజులుగా కోళ్లు మృతి చెందుతుంటే యాజమాన్యాలు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి
మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జగ్గారెడ్డి
నిరాశ్రయులైన 30 లక్షల మంది ఇరానీయులు

Updated Date - Mar 15 , 2026 | 06:53 AM