kumaram bheem asifabad- అర్హులందరికీ చేయూత పింఛన్లు అందజేయాలి
ABN , Publish Date - Nov 13 , 2026 | 10:30 PM
అర్హులైన ప్రతీ ఒక్కరికి చేమూత పింఛన్లు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఎమ్మెల్యే చేయూత పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
వాంకిడి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి చేమూత పింఛన్లు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఎమ్మెల్యే చేయూత పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఎంతో ఆసరా అని చెప్పారు. అర్హులైన అబ్దిదారులు నిరాశ చేందకూడదని అఽధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటారని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ జాబిరే పెంటు, ఎంపీడీఓ పాటిల్ జోత్స్న, ఎంపీడీఓ ఖాజా అజీజుద్దిన్, వాంకిడి, బంబార, ఖమన సర్పంచ్‌లు సతీష్, కృష్ణాజీ, సునీత, లబ్దిదారులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి చేయూత పింఛన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని కేస్లాగూడలోని రైతువేదికలో నూతనంగా పింఛన్ మంజూరైన పత్రాల పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న అదైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. అర్హులందరికీ అందజేస్తామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నికరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేవపెడుతున్నట్టు తెలిపారు. అలాగే పింఛన్లు కూడా అర్హులకు అందుతాయన్నారు. ఈ అవకాశాలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాయిరాంగౌడ్, తహసీల్దార్ నాగార్జునగౌడ్, ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.