Share News

kumaram bheem asifabad- అర్హులందరికీ చేయూత పింఛన్లు

ABN , Publish Date - Nov 12 , 2026 | 10:22 PM

జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికి చేయూత పింఛన్లు మంజూరు చేయనున్నామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలోని లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు హాజరయ్యారు.

kumaram bheem asifabad- అర్హులందరికీ చేయూత పింఛన్లు
మంజూరు పత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌ హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికి చేయూత పింఛన్లు మంజూరు చేయనున్నామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలోని లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మితో పాటు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో చేయూత పెన్షన్ల కోసం 9,466 దరఖాస్తులు రాగా 8,540 మంది అర్హులుగా ఉన్నారని చెప్పారు. మిగతా దరఖాస్తులను పరిశీలించనున్నామన్నారు. చేయూత పింఛన్‌ పథకం అనేది సమాజంలోని అత్యంత బలహీనవర్గాలకు ఆర్థికంగా ఆదుకునేందుకేనని వివరించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువ దరఖాస్తులు పింఛన్ల మంజూరు కోసం వచ్చేవని చెప్పారు. వాటి సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియ నిరాంతరంగా కొనసాగుతుందని చెప్పాఉ. దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు ఎంతో అసరాగా ఉంటుందన్నారు. పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆకాష్‌, అహ్మద్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మంగ, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, డీఆర్‌డీవో దత్తారావు, డీపీఎం రామకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): లబ్ధిదారులు పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని 30 వార్డులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన లబ్దిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను గురువారం మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పింఛన్ల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంటుందని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఫించన్‌ మంజూరు అవుతుందన్నారు. కలెక్టర్‌ కె. హరిత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చేయూత పింఛన్లు అర్హులకు అందేలా చర్యలు తీసుకుం టామని తెలిపారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహీన్‌ సుల్తానా, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 10:22 PM