Share News

kumaram bheem asifabad- అర్హులకే ‘చేయూత’

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:25 PM

పేద కుటుంబం నేపధ్యం, వయసు మీదపడ్డా పింఛను అందని దైన్యం కొందరిది. వైకల్యంతో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితుల్లో ప్రతి నెలా వచ్చే కొంత మొత్తంతో జీవితాన్ని నెట్టుకురావచ్చనే భావన మరికొందరిది. భర్తను కోల్పోయి కుటుంబ పోషణ భారంగా మారిన దయనీయ స్థితి ఇంకొందరిది. ఇలా వివిధ కారణాలతో ప్రభుత్వం అందించే చేయూత పింఛన్‌ కోసం పలువురు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు

kumaram bheem asifabad- అర్హులకే ‘చేయూత’
లోగో

- విచారణకు ప్రత్యేక యాప్‌ రూపకల్పన

- జిల్లాలో 8,477 మంది దరఖాస్తు

చింతలమానేపల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పేద కుటుంబం నేపధ్యం, వయసు మీదపడ్డా పింఛను అందని దైన్యం కొందరిది. వైకల్యంతో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితుల్లో ప్రతి నెలా వచ్చే కొంత మొత్తంతో జీవితాన్ని నెట్టుకురావచ్చనే భావన మరికొందరిది. భర్తను కోల్పోయి కుటుంబ పోషణ భారంగా మారిన దయనీయ స్థితి ఇంకొందరిది. ఇలా వివిధ కారణాలతో ప్రభుత్వం అందించే చేయూత పింఛన్‌ కోసం పలువురు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల చేయూత పింఛన్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు నిబంధనలు పెట్టింది. ఈ మేరకు జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక డిసిగ్నేటెట్‌ వెరిఫైడ్‌ ఆఫీసర్‌(డీవీవో)లను నియమించనుంది. మండలస్థాయిలో ఎంపీడీవోలు, మండల పంచాయతీ ఆఫీసర్లు, సూపరిండెంటెంట్‌ ర్యాంకు అధికారులను డీవీవోలుగా నియమించనున్నారు. వీరందరికి ఎంపీడీవో లాగిన్‌ ఇస్తారు. మున్సిపాల్టీలో సూపరిండెంటెంట్‌లు, రెవెన్యూ అధికారులు, ప్లానింగ్‌ అధికారులు, సీనియర్‌ అసిస్టెంట్‌ పై అధికారులను డీవీవోలుగా నియమించాల్సి ఉంది. వీరికి మున్సిపల్‌ కమిషనర్‌ లాగిన్‌ ఇస్తారు. ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ధ్రువీకరిస్తారు. విచారణ జరిపిన జాబితాను సెర్ఫ్‌ నుంచి కలెక్టర్లకు పంపనున్నారు. తుది నిర్ణయం కలెక్టర్‌ లబ్ధిదారులకు పెన్షన్‌ మంజూరు చేయనున్నారు. కలెక్టర్‌ దృవీకరణ తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రొసిడెంగ్‌ జారీ కానున్నాయి.

- దివ్యాంగుల ఎంపికలో..

దివ్యాంగుల ఎంపికలో కనీసం 40 శాతం వైకల్యం ఉంటేనే అర్హతగా భావించనున్నారు. వినికిడి లోపానికి సంబంధించి 51 శాతం ఉండాల్సి ఉంటుంది. వైకల్యం ధ్రవీకరణ పత్రంతో పాటు సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొనున్నారు. ఈ నెల 15 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వటంతో పూర్తి స్థాయి అర్హత పత్రాలు లేకున్నా అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. విచారణ సమయంలో మాత్రం పూర్తిగా సంబంధిత అర్హత పత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. కాగా జిల్లాలో ఇప్పటి వరకు 8,477 దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వితంతువులు 5,487, ఒంటరి మహిళలు 1,067, దివ్యాంగులు 1,744, చేనేత 94, కల్లుగీత 85 దరఖాస్తులు చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా దరఖాస్తుదారులు పింఛన్‌ కోసం కార్యాలయాలు చుట్లూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొత్త పింఛన్లు అందజేస్తామని ప్రకటించడంపై దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- చివరి సారిగా..

కాగా చివరి సారిగా 2022 అక్టోబరులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కొత్త పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత పిం ఛన్లు మంజూరు కాలేదు. వ్యధ్యాప్య పింఛన్ల మంజూరుకు అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించినప్పటికీ, ఆ మే రకు గత ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం సైతం రెండేళ్లుగా ఊరిస్తూ వస్తున్నది, 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా చేయూత పథకం కింద అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని, ప్రస్తుతం దివ్యాంగులకు ఇస్తున్న పింఛన్‌ను 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు, ఇతరత్రా పింఛన్లను 2,016 నుంచి 4,016 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాగా జిల్లాలో ఇ ప్పటి వరకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే అదేశాలు జారీ చేయడంతో అధికారులు కూడా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలు స్తోంది. కానీ ఈసారి గత కేటగిరీల వారీగా కాకుండా కొత్తగా తలసేమియా, సికల్‌సెల్‌ ఎనీ మియా బాధితులకు కూడా ఫించన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Updated Date - Sep 19 , 2026 | 11:25 PM