బడిలో టాయిలెట్స్‌ను శుభ్రం చేసిన ఎంపీ కొండా
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:09 AM
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వికారాబాద్ జిల్లా యాలాల మండల ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూత్రశాలలను శుభ్రం చేశారు. ..
తాండూరు, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వికారాబాద్ జిల్లా యాలాల మండల ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూత్రశాలలను శుభ్రం చేశారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజైన సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ పాఠశాలల నిర్మాణానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. తన సొంత ఖర్చుతో 17 టాయిలెట్ క్లీనింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి 510 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ మూత్రశాలలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.