Share News

చెన్నూరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

ABN , Publish Date - Mar 30 , 2026 | 10:45 PM

రానున్న గోదావరి పుష్క రాలను దృష్టిలో ఉంచుకుని పంచక్రోశ గోదావరి ఉత్తర వాహిని తీర ప్రాంతమైన చెన్నూరును పర్యాటక కేంద్రంగా అభివృద్థి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

చెన్నూరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

చెన్నూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : రానున్న గోదావరి పుష్క రాలను దృష్టిలో ఉంచుకుని పంచక్రోశ గోదావరి ఉత్తర వాహిని తీర ప్రాంతమైన చెన్నూరును పర్యాటక కేంద్రంగా అభివృద్థి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం చెన్నూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి వివేక్‌వెంకటస్వామి ప్రత్యేక శ్రద్ధ చూపించి చెన్నూరు ప్రాంత ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచు కుని రూ. 500 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్థి కార్యక్రమాలను చే పట్టాలన్నారు. పుష్కరఘాట్‌లు, స్నాన ఘట్టాలను నిర్మించాలని కోరా రు. గోదావరి తీరంలో నిర్మించతలపెట్టిన వైకుంఠదామాన్ని ఆధునిక సౌకర్యాలతో త్వరగా పుష్కరాల లోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవా లన్నారు. ప్రసిద్దిగాంచిన కోటిలింగాల క్షేత్రం నారాయణపూర్‌ సమీపం లో పుష్కరఘాట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్తర వాహిని ము గింపు ప్రాంతమైన పారుపెల్లి కాలభైరవ స్వామి దేవాలయాన్ని ప్రభు త్వ నిధులతో అభివృద్ధి చేయాలని, శాశ్వత రోడ్డు సౌకర్యం కల్పించా లన్నారు. అలాగే ఇటీవల గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు జరు గుతున్న ఇబ్బందులపై తగు చర్యలు తీసుకోవాలని, రెండు రోజుల క్రితం మృతిచెందిన గురు కుల విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ సమావేంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీ నారాయణరెడ్డి, కౌన్సిలర్లు శివకృష్ణ, శాంతవెంకటనర్సయ్య, నాయకులు జాడి తిరుపతి, రాజశేఖర్‌గౌడ్‌, వెంకటేష్‌, శంకర్‌, షఫీవుద్దీన్‌, మల్లయ్య, శ్రావణి, రాజన్న, ప్రసాద్‌, గణేష్‌సింగ్‌, వెంకట్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 10:45 PM