Share News

దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న చెన్నూరు వాసి

ABN , Publish Date - Mar 03 , 2026 | 11:15 PM

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కోటబొగుడ కాలనీకి చెందిన కొత్తపల్లి నాగరాజు దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం చెన్నూర్‌ పట్టణానికి చెందిన నాగరాజు పట్టణంలోని ఐఐఎఫ్‌ఎల్‌ అనే ప్రైవేటు బ్యాంకులో బ్రాంచ్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న చెన్నూరు వాసి
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఆందోళన చెందుతున్న నాగరాజు కుటుంబ సభ్యులు

-ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు

చెన్నూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కోటబొగుడ కాలనీకి చెందిన కొత్తపల్లి నాగరాజు దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం చెన్నూర్‌ పట్టణానికి చెందిన నాగరాజు పట్టణంలోని ఐఐఎఫ్‌ఎల్‌ అనే ప్రైవేటు బ్యాంకులో బ్రాంచ్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం బ్యాంకు సిబ్బందిని హై ట్రిప్‌లో భాగంగా సంస్థ దుబాయ్‌కు పంపించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధ వాతావరణంతో దుబాయ్‌ ఎయిర్‌పోర్టుపై దాడులు జరిగి అన్ని విమానాలు రద్దయ్యాయి. దీంతో నాగరాజుతో పాటు మరో ముగ్గురు ఐఐఎఫ్‌ఎల్‌ సిబ్బంది దుబాయ్‌లో చిక్కుకున్నారు. అక్కడి ఎయిర్‌పోర్టు క్లియరెన్స్‌ ఇచ్చేంత వరకు కూడా వారు ఇండియాకు తిరిగిరాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు నాగరాజు కుటుంబ సభ్యులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కుటుంబీకులతో వీడియోకాల్‌లో మాట్లాడిన నాగరాజు తాను క్షేమంగా ఉన్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాడు. తన భర్తను సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలని మంత్రి వివేక్‌ వెంకటస్వామిని నాగరాజు భార్య కోరింది.

Updated Date - Mar 03 , 2026 | 11:15 PM