kumaram bheem asifabad- సీఈఐఆర్‌తో చోరీ ఫోన్లకు చెక్
ABN , Publish Date - Jul 28 , 2026 | 11:09 PM
సెల్‌ఫోన్ పోయిందంటే ఇక దొరకదన్న పరిస్థితులకు తెరప డుతోంది. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఇడెంటిటీ రిజిస్ట్టర్(సీఈఐ ఆర్) పోర్టల్‌పోయిన, చోరీకి గురైన మొబైళ్లను గుర్తించి బాధితులకు అప్పగించడం సులభమవు తోంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఙానాన్ని సమర్థంగా వినియోగిస్తూ మొబైల్ రికవరీలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
కెరమెరి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్ పోయిందంటే ఇక దొరకదన్న పరిస్థితులకు తెరప డుతోంది. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఇడెంటిటీ రిజిస్ట్టర్(సీఈఐ ఆర్) పోర్టల్‌పోయిన, చోరీకి గురైన మొబైళ్లను గుర్తించి బాధితులకు అప్పగించడం సులభమవు తోంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఙానాన్ని సమర్థంగా వినియోగిస్తూ మొబైల్ రికవరీలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించి మొబైల్ రికవరీ మేళాలో ఫోన్లను ఎస్పీ నితికా పంత్ బాధితులకు అందజేశారు. మొబైల్‌లో బ్యాంకు ఖాతాలు, ఆధార్, యూపీఐ, వ్యక్తిగత వివరాలు భధ్రపరుస్తున్న నేపథ్యంలో ఫోన్ పొగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో బ్లాక్ చేయించి, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ వివరించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, ఫోన్ ఐఎంఈఐ నంబరు, పోయిన స్థలం, తేరీ తదితర వివరాలు ఇవ్వాలి. అనంతరం సీఈఐఆర్ పోర్టర్‌లో వివరాలు నమోదు చేస్తే ఫోన్ బ్లాక్ అవుతుంది. దీంతో ఇతరులు వినియోగించే అవకాశం ఉండదు. పోలీసులు సాంకేతిక పరిజ్ఙానంతో ట్రేస్ చేసి బాధితులు తిరిగి అందజేస్తారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా విక్రేత నుంచి రసీదు తీసుకోవాలి. ఫక్షన్ ఐఎంఈఐ నంబరు పరిశీలించి కొనుగోలు చేయాలని, చోరీ ఫోన్లు కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు ఎదు ర్కొవలసిన పరిస్థితి ఉంటుంది. గత ఏడాది నుంచి జిల్లాలో పోయిన సెల్ ఫోన్లను జిల్లా పోలీసు యం త్రాంగం కసరత్తు చేసి రూ.23.40లక్షల విలువైన 117 మొబైళ్లు రికవరీ చేశారు. ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత రసీదు ఈఎంఐ నంబరు వివరాలు భద్ర పర్చుకోవాలని పోలీసులు సూచిస్టున్నారు.