kumaram bheem asifabad- లో వోల్టేజీ సమస్యలకు చెక్
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:29 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగానికి నాణ్యమైన, నిరంతరం విద్యుత్ సరఫరాతో పాటు లో వోల్టేజీ సమస్యలకు చెక్ పెట్టడం విద్యుత్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వర్షాకాలం, సాగు పనుల సమయంలో విద్యుత్‌లో వోల్టేజీ హెచ్చు తగ్గులు, ట్రాన్స్‌ఫార్మర్ల లోపాలు, ఫ్యూజ్ హెచ్చు తగ్గులు, ట్రాన్స్‌ఫార్మర్ల లోపాలు, ఫ్యూజ్‌లు కాలి పోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు
- జిల్లాలో 16,137 వ్యవసాయ కనెక్షన్లు
- సరఫరాలో హెచ్చుతగ్గులను నియంత్రించేలా 35 కెపాసిటర్ బ్యాంకుల ఏర్పాటు
- మెరుగు పడుతున్న కరెంట్ సరఫరా
కాగజ్‌నగర్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగానికి నాణ్యమైన, నిరంతరం విద్యుత్ సరఫరాతో పాటు లో వోల్టేజీ సమస్యలకు చెక్ పెట్టడం విద్యుత్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వర్షాకాలం, సాగు పనుల సమయంలో విద్యుత్‌లో వోల్టేజీ హెచ్చు తగ్గులు, ట్రాన్స్‌ఫార్మర్ల లోపాలు, ఫ్యూజ్ హెచ్చు తగ్గులు, ట్రాన్స్‌ఫార్మర్ల లోపాలు, ఫ్యూజ్‌లు కాలి పోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కరెంటు అంతరాయ సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. అలాగే నిరంత విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉండగా, వరి, పత్తి, పప్పు ధాన్యాల సాగు విస్తృతంగా కొనసాగుతోంది. సాగు సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే పంటలకు సకాలంలో నీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీన్ని అరికట్టేందుకు విద్యుత్‌శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో వ్యవసాయ రంగానికి 16,137 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 33/11 కేవీ సబ్ స్టేషన్లు 32, 132/(33 కేవీ సబ్‌స్టేషన్లు మూడు ఉన్నాయి. వ్యవసాయ బోర్లు, మోటార్లపై ఆధారపడే రైతులకు విద్యుత్ సరఫరా ఎంత కీలకమో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఓల్టేజీ హెచ్చుతగ్గులు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. తక్కువ ఓల్టేజీ మోటర్లు సరిగా పని చేయక పోవటం, అధిక ఓల్టేజీ మోటార్లు కాలి పోవడం సమస్యలు వస్తుండేవి. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పేట్టేందుకు విద్యుత్ శాఖ అధికారులు జిల్లాలో 15 మండలాల్లో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతీ మండలంలో అధిక లోడ్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, పాత విద్యుత్ లైన్లు, తరుచూ అంతరాయలు ఏర్పడే ఫీడర్లను గుర్తించి కెపాసిటర్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియతో కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అధిక లోడ్‌ను నియంత్రించేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలో విద్యుత్ అదికారులు క్షేత్ర స్థాయిలో సర్వేలు చేపట్టారు. ఓవర్ లోడ్ సమస్య, లోవోల్టేజీ సమస్యలున్న ప్రాంతాలను గుర్తించి కెపాసిట్ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 35 కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. గతం నెలకొన్న సమస్యలకు పూర్తిగా తొలగిపోయేలా చర్యలు చేపడుతున్నారు. అధికారుల నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే కూడా ప్రత్యామ్నాయ చర్యలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో చిక్కులు లేకుండా అధికారులు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు.