చర్లపల్లి-తిరుచానూరు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
ABN , Publish Date - May 18 , 2026 | 03:24 AM
తిరుపతి యాత్రికుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన తిరుచానూరు-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ రైలును చర్లపల్లిలో ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు...
కుషాయిగూడ, మే 17 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి యాత్రికుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన తిరుచానూరు-చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ రైలును చర్లపల్లిలో ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. చర్లపల్లి నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9.30కు బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు(17059)సోమవారం మధ్యాహ్నం 12.30కు తిరుచానూరు చేరుకుంటుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4గంటలకు బయలుదేరే ఈ రైలు(17060) మంగళవారం ఉదయం 8గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.