76 అడుగుల బాబు కటౌట్‌పై పుష్పాభిషేకం
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:44 AM
చంద్రబాబు 76వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు 76వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని టీటీడీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్ వద్ద 76అడుగుల ఎత్తైన చంద్రబాబు కటౌట్‌పై డ్రోన్‌లతో పుష్పాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 76కిలోల కేక్‌ను కట్ చేయనున్నట్లు వివరించారు. కాగా, ‘‘యుగానికొక్కడు చంద్రబాబు’’ అనే అంశంపై ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు సీబీఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ వేమూరి నరేష్ వెల్లడించారు. 15-35ఏళ్ల లోపు తెలుగు వారు పోటీల్లో పాల్గొనవచ్చని, ఎంపిక చేసిన రచనలను పుస్తక రూపంలో ముద్రిస్తామని తెలిపారు. గూగుల్ ఫామ్ ద్వారా ఉచితంగా నమోదు చేసుకుని పోటీల్లో పాల్గొనవచ్చని, వివరాలకు 93474 88350 , 89777 71065 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.