కోర్టు తీర్పుపై తప్పుదోవ పట్టిస్తున్నారు
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:19 AM
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని...
కేటీఆర్, హరీశ్‌రావులపై చామల ధ్వజం
హైదరాబాద్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని... కానీ క్లీన్‌చిట్ ఇచ్చినట్లుగా ప్రజల్ని కేటీఆర్, హరీశ్‌రావులు తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరంపైన సీబీఐ విచారణను ఆపేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపైన సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే ఏమవుతుందని వారు మాట్లాడుతున్నారని, కానీ కాళేశ్వరానికి మేడిగడ్డ గుండెకాయంటూ కేసీఆరే చెప్పారని పేర్కొన్నారు. ఎన్డీఎ్‌సఏ సైతం మేడిగడ్డలో నీళ్లు నింపొద్దని స్పష్టం చేసిందన్నారు.