కేసీఆర్ దోచుకుంటే.. కిషన్‌రెడ్డి దాచుకున్నారా?
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:07 AM
తెలంగాణను పదేళ్లపాటు బీఆర్‌ఎస్, కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఏం చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు..
బీఆర్‌ఎస్ పదేళ్ల అవినీతి పాలనకు వంత పాడారు
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను పదేళ్లపాటు బీఆర్‌ఎస్, కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంటే.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఏం చేశారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ దోచుకుంటే.. కిషన్‌రెడ్డి దాచుకున్నారా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల అవినీతి పాలనకు కిషన్‌రెడ్డి వంత పాడారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో లేకపోవడంతో.. ఆ స్ర్కిప్టును కిషన్‌రెడ్డితో చదివించారని ధ్వజమెత్తారు. ఏపీ పునర్విభజన చట్టం బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్‌ఆర్ ట్యాక్స్ అంటూ కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను చామల ఖండించారు. పార్లమెంట్ వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నించారని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి కుమ్మక్కు రాజకీయాల ప్రజలకు తెలుసునన్నారు. బీఆర్‌ఎస్ అవినీతి, కాళేశ్వరం కుంభకోణంపై సీబీఐ విచారణ ఎందుకు చేయడంలేదో చెప్పాలన్నారు.