కేటీఆర్ చదువుకున్నవా!?: చామల
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:55 AM
రాష్ట్రంలోని 2.75 కోట్ల ఎకరాల్లో ఏకంగా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారంటూ కేటీఆర్ అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన చదువుకున్నడా
‘‘రాష్ట్రంలోని 2.75 కోట్ల ఎకరాల్లో ఏకంగా కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారంటూ కేటీఆర్ అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన చదువుకున్నడా? లేక అమెరికా నుంచి దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్నడా?’’ అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి కేటీఆర్‌కు నిద్ర పట్టట్లేదని, మానసిక స్థితి సరిగా లేక.. కాంగ్రెస్ మరో 50 ఏళ్లు అధికారంలోకి రాదని అంటున్నాడని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు భూములు కొన్నట్లుగా ఆరోపిస్తున్న కేటీఆర్.. ఎక్కడ కొన్నారో చూపాలని సవాల్ విసిరారు.