కొత్త సభ్యులకు సవాళ్లు....
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:13 PM
మున్సిపాలిటీల్లో కొలువు దీరిన నూతన పాలక సభ్యులకు కొత్త స మస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మంచిర్యాల కార్పొ రేషన్‌తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టి పేట మునిసిపాలిటీల్లో సమస్యలు కుప్పలు తెప్పలు గా పేరుకుపోయాయి.
-మున్సిపాలిటీల్లో తిష్టవేసిన దీర్ఘకాలిక సమస్యలు
-సంవత్సరాల తరబడి తాగునీటికి ఇబ్బందులు
-డంపింగ్ యార్డు లేక కంపుకొడుతున్న వీధులు
-శివారు ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అద్వాన్నం
-నూతన పాలక వర్గంపైనే ప్రజల ఆశలు
మంచిర్యాల, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో కొలువు దీరిన నూతన పాలక సభ్యులకు కొత్త స మస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మంచిర్యాల కార్పొ రేషన్‌తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టి పేట మునిసిపాలిటీల్లో సమస్యలు కుప్పలు తెప్పలు గా పేరుకుపోయాయి. ముఖ్యంగా గత ఏడాదిలో ప్రత్యేకా ధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే రాజ్య మే లుతుండగా, ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితు లు నెలకొన్నాయి. బల్దియాల్లో ప్రధానంగా అంతర్గత రో డ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్య జఠిలమై కూ ర్చుంది. డ్రైనేజీల్లో నెలల తరబడి పూడిక తీత మరుగు న పడగా, మురికి నీటి నిలువ ఉండి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జి ల్లా వ్యాప్తంగా అన్ని మునిపాలిటీల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేసిన దాఖలు గత ఐదేళ్లలో లేవంటే అతిశ యోక్తికాదు. దోమల నివారణ మందు సైతం డ్రైనేజీల్లో పిచికారీ చేయకపోవడంతో అవి విజృంభించి ప్రజలు విష జ్వరాల భారిన పడుతున్నారు. లార్వా వేగంగా వృ ద్ధి చెంది సాయంత్రం వేళల్లో కుప్పలుగా దోమలు ఇళ్ల లోకి చేరుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీటికీ తప్పని అవస్థలు....
జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో ప్రజలను తాగునీటి సమస్య విపరీతంగా వేధిస్తోంది. మిషన్ భగీరథ పథకం కింద రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్న సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో నీటి సరఫరాపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా రో జు విడిచి రోజు, మూడు రోజులకోసారి ప్రజలకు కుళా యిల ద్వారా తాగునీరు అందుతోంది. దీంతో పుర ప్రజ లకు తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. మంచినీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్లలో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నె లకొన్నాయి. మునిసిపాలిటీల పరిధిలోని వివిధ రిజర్వా యర్లలో కనీసం క్లోరినేషన్ చేసిన పాపాన కూడా పోక పోవడం గమనార్హం. కొన్నేళ్లుగా నీళ్ల ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్‌తో శుద్ధి చేసిన దాఖలాలు కూడా లేవు. వర్షా కాలంలో తాగునీరు కలుషితం అయ్యే అవకాశాలు ఉం డగా, తద్వారా ప్రజలు అనారోగ్యాల భారిన పడే అవకా శం ఉంటుంది. అయినప్పటికీ నీళ్ల ట్యాంకుల్లో బ్లీచింగ్ కూడా చేయలేదనే ఆరోపణలు అనేకం ఉన్నాయి.
విలీన గ్రామాల్లో సమస్యలే సమస్యలు....
దాదాపు 69 ఏళ్ల చరిత్ర గలిగిన మంచిర్యాల ము నిసిపల్ కార్పొరేషన్‌లోని విలీన గ్రామాల్లో కొంత కాలం గా సమస్యలు తిష్ట వేశాయి. కార్పొరేషన్‌లో విలీనం చేసిన పరిసర గ్రామాల్లో ఇప్పటికీ సరియైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రక్షిత మంచి నీరు ప్రజలకు అందని ద్రాక్షలాగా తయారైంది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటా నల్లాలు ఏర్పా టు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతర్గత రోడ్లు సైతం పూర్తి అధ్వానంగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. కార్పొరేషన్‌లో విలీనం కావడంతో అటు మునిసిపల్ అ ధికారులుగానీ, ఇటు గ్రామ పంచాయతీలు గానీ పట్టిం చుకోకపోవడం వల్ల సమస్యలు తీరే మార్గం కానరావడం లేదని ప్రజలు వాపోతున్నారు.
డంపింగ్ యార్డులేక అవస్థలు...
కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య సిబ్బంది ఇండ్ల నుం చి నిత్యం సేకరించే చెత్తను ఒకచోట వేసేందుకు అవసరమైన డంపింగ్ యార్డులేక అవస్థలు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్రం అయినప్పటికీ మున్సిపాలిటీకి డంప్ యార్డు లేని కారణంగా వాగులు, చెరువులు, ఖా ళీ ప్రదేశాల్లో చెత్తను వేస్తుండటంతో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తుందని ప్రజలు అందోళనలు చేస్తున్నారు. అండా ళమ్మ కాలనీ సమీపంలో, రాళ్లవాగు కాజువే వంతెనకు ఇరువైపులా మున్సిపాలిటీ చెత్తతోపాటు చికెన్ సెంటర్ వ్యర్థాలను పడవేస్తుండటంతో తీవ్రమైన దుర్వాసన వ్యాపించి, ప్రజలు రోగాల బారినపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో మునిసిపల్ చెత్తను తరుచుగా తగుల బె డుతుండటంతో నల్లని దట్టమైన పొగల కారణంగా అ నారోగ్యం పాలు కావలసి వస్తుందని ప్రజలు వాపోతు న్నారు. కార్పొరేషన్‌లో కొత్త పాలక వర్గం కొలువుదీరినం దున సమస్యలను అత్యవసరంగా భావించి పరష్కరిం చాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
రోడ్ల నిర్మాణంలోనూ శ్రద్ధ వహించాలి....
కార్పొరేషన్ పరిధిలోని శివారు ప్రాంతాలైన రాజీవ్‌నగర్, తిలక్‌నగర్, శ్రీనివాస గెర్డెన్ ఏరియా, గర్మిళ్ల, పాత మంచిర్యాలతోపాటు పట్టణంలోని పలు వీధుల్లో సరియైున రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐదేళ్లుగా పట్టణ శివారుల్లో శరవేగంగా ఇండ్ల నిర్మాణం జరిగింది. ఆయా ప్రాంతాల్లో రోడ్డు నిర్మించడంలో మాత్రం పాత పాలక వర్గం శ్రద్ధ చూపలేదు. కొన్ని ప్రాంతాల్లో కాలినడక వెళ్లేందుకు సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. శివారు ప్రాంతాల్లో డ్రైనేజీలు ఎక్కడకూడా కానరావు. మురికి నీరు వీధుల్లో ప్రవహించే పరిస్థితు లు కూడా ఉన్నాయి. ఈ విషయమై నూతన పాలక వ ర్గం అత్యంత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉం ది. శ్రీశ్రీ నగర్‌లో 100 ఫీట్ల బైపాస్ రోడ్డు నిర్మాణం అ ర్థంతరంగా ఆగిపోగా, దాన్ని కొనసాగించేందుకు పాలకులు శ్రద్ధ చూపాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే వైశ్యా భవన్ సమీపంలోని 80 ఫీట్ల మరో బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని సైతం యుద్ద ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో ట్రాఫిక్ విపరీ తం గా పెరిగిన దృష్ట్యా బైపాస్ రోడ్ల ఏర్పాటు తప్పనిసరి. పై సమస్యలను ధృష్టిలో ఉంచుకొని నూతన పాలక వ ర్గం ప్రత్యేక కార్యాచరణ చేపట్టవలసిన అవసరం ఉంది.