kumaram bheem asifabad- చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Sep 10 , 2026 | 10:43 PM
అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమనత్వం, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్‌లో వెనుకబడి తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసి చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమనత్వం, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. కలెక్టరేట్‌లో వెనుకబడి తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసి చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, బీసీ సంక్షేమ సంఘం అధికారి నదీం, సీపీవో గురవయ్య, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఆమె చిత్ర పటానికి ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దుర్గం శ్యాంరావు, రాజేశ్వర్, దుర్గం దీపక్, అరుణ్, నాగ్‌సేన్, రమేస్, మారుతి, సురేష్, బుద్దాజీ, భిక్షపతి, ప్రశాంత్, బాలు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన దీర వనిత ఐలమ్మ అని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు రామడుగుల రమేష్, నాయకులు తిరుపతి, వెంకటేష్, శంకర్, జావీద్‌అలీ, నవీన్, శ్రీనివాస్, మల్లేష్, తిరుపతి పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటి డైరెక్టర్ నైతం రాంచందర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శోభన్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతీ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని రజక సంఘం అధ్యక్షుడు సంతోష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు నల్లూరి రాజు, సతీష్, సాగర్, జగదీశ్, రవి, మల్లేష్, అరుణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి దత్తాత్రేయ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయాలను అంతా కొనసాగిం చాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సిడం శంకర్, నైతం అంజన్న, శ్రీకాంత్, కాళిదాసు, అంజన్న, నీలయ్య, మహేష్, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.