Share News

Chairman Gutha Sukender Reddy: రాజీనామాపై పునరాలోచించుకోండి!

ABN , Publish Date - Jan 06 , 2026 | 02:39 AM

భావోద్వేగంతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, రాజీనామాపై పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

Chairman Gutha Sukender Reddy: రాజీనామాపై పునరాలోచించుకోండి!

  • ఎమ్మెల్సీ కవితకు మండలి చైర్మన్‌ సూచన

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): భావోద్వేగంతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, రాజీనామాపై పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం ప్రశ్నోత్తరాల అనంతరం సభలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలపై కవిత వివరణ ఇస్తూ భావోద్వేగానికి గురయ్యారు. గత సెప్టెంబరు 3వ తేదీనే చైర్మన్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ పంపినట్టు తెలిపారు. ఇప్పటికైనా తన రాజీనామా ఆమోదించాలని కోరారు. దీనిపై చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్పందిస్తూ భావోద్వేగాలతో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు.

Updated Date - Jan 06 , 2026 | 02:39 AM