Share News

kumaram bheem asifabad- చైన్‌ స్నాచింగ్స్‌ కలకలం..

ABN , Publish Date - Jul 15 , 2026 | 10:39 PM

సిర్పూర్‌ నియోజకవర్గ పరిధి లో చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నా యి. గతంలో గృహాలు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండు, రైల్వేస్టేషన్లను అడ్డగా మార్చుకొని చోరీలకు పాల్పడిన సంఘటనలు ఉండగా, ఇప్పుడు మాత్రం మహిళలను టార్గెట్‌ చేస్తూ మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లుతున్నారు.

kumaram bheem asifabad- చైన్‌ స్నాచింగ్స్‌ కలకలం..
లోగో

కాగజ్‌నగర్‌/సిర్పూరు(టి), జూలై 15 (ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌ నియోజకవర్గ పరిధి లో చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నా యి. గతంలో గృహాలు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండు, రైల్వేస్టేషన్లను అడ్డగా మార్చుకొని చోరీలకు పాల్పడిన సంఘటనలు ఉండగా, ఇప్పుడు మాత్రం మహిళలను టార్గెట్‌ చేస్తూ మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లుతున్నారు. ప్రస్తుతం బంగారమే వారి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టు వరుస సంఘటనలతో తెలుస్తోంది.

వారం రోజుల క్రితం కాగజ్‌నగర్‌ ఎఫ్‌కాలనీలో బైక్‌పై వస్తున్న మహిళ మెడ నుంచి మరో బైక్‌పై వచ్చిన దుండగులు గొలుసు లాక్కుని వెళ్లారు.. సీసీ కెమెరాలో వ్యక్తుల ముఖాలు చిక్కినప్పటికీ ఇంత వరకు ఈ కేసు కొలిక్కి రాలేదు. ఈ సంఘటన తేరుకోక ముందే శనివారం సిర్పూరు(టి) బస్టాండులో బస్సు ఎక్కుతున్న మహిళ మెడల్లోంచి బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనలు బట్టి పరిశీలిస్తే కేవలం ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లుగా భావిస్తున్నారు. అంతరాష్ట్ర ముఠాకు చెందిన సభ్యులే ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సాయంత్రం వేళల్లో రద్దీ తక్కువగా ఉన్న రహదారులపై ముఖాలకు మాస్క్‌లు, హెల్మెట్‌ పెట్టుకొని గుర్తుపట్టకుండా అన్ని జాగ్రత్తలను దొంగలు తీసుకుంటున్నారు. బైక్‌పై వేగంగా వచ్చి మహిళ మెడలోని గొలుసును లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి బయటపడుతున్నారు. కాగజ్‌నగర్‌లో జరిగిన సంఘటనలో మాత్రం మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. గతేడాది మే 19న కాగజ్‌నగర్‌ బస్టాండు నుంచి బయలు దేరిన చింతలమానేపల్లికి చెందిన రమ్య అనే మహిళ హ్యాండ్‌ బ్యాగ్‌లో మూడు న్నర తులాల బంగారరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. అలాగే ఏప్రిల్‌ 8న కాగజ్‌నగర్‌ కాపువాడకు చెందిన మహిళ మెడలో బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. మే 28న ఆసిఫాబాద్‌ మండలం మానిక్‌గూడలో అంగన్‌వాడీ కార్యకర్త పద్మ విధులు ముగించుకొని బస్సు కోసం వేచి చూస్తుండగా, బైక్‌ పై వచ్చి నమ్మించి బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు. ఆరు నెలల క్రితం కాగజ్‌నగర్‌ రైల్వేకాలనీలో ఓ మహిళ సాయంత్రం ఇంటి ఎదు ట కూర్చుని ఉండగా గుర్తు తెలియని వ్యక్తి గొలుసు లాక్కుని పరారయ్యాడు. ఇలా వరు స సంఘటనలు జరుగుతుండడంతో నింది తుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు దృష్టి సారించారు.

Updated Date - Jul 15 , 2026 | 10:39 PM