Share News

స్టీల్‌ వినియోగదారుల ఫోరమ్‌ జాతీయ వైస్‌ చైౖర్మన్‌గా సీహెచ్‌ శ్రీనివాస్‌

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:26 AM

స్టీల్‌ వినియోగదారుల ఫోరమ్‌ (ఎస్సీఎఫ్‌) జాతీయ వైస్‌ చైర్మన్‌గా తెలంగాణకు చెందిన సీహెచ్‌ శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈమేరకు బుధవారం ఫోరమ్‌...

స్టీల్‌ వినియోగదారుల ఫోరమ్‌ జాతీయ వైస్‌ చైౖర్మన్‌గా సీహెచ్‌ శ్రీనివాస్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): స్టీల్‌ వినియోగదారుల ఫోరమ్‌ (ఎస్సీఎఫ్‌) జాతీయ వైస్‌ చైర్మన్‌గా తెలంగాణకు చెందిన సీహెచ్‌ శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈమేరకు బుధవారం ఫోరమ్‌ జాతీయ చైర్మన్‌ నివేదిత శర్మ ప్రేమ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీనివాస్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల బాధ్యతలను చూస్తారు. ఉక్కు పరిశ్రమ రంగంలోని సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన ఈ ఫోరమ్‌ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిర పడ్డారు. పర్యావరణహిత స్టీల్‌ తయారీని ప్రోత్సహించడం, వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు కృషి చేస్తానని శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Apr 23 , 2026 | 04:26 AM