Ancient Relics: తవ్వకాల్లో పగిలిన వందల ఏళ్ల నాటి కుండ
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:06 AM
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం వద్ద జరుగుతున్న తవ్వకాల్లో వందల ఏళ్ల క్రితం నాటి మట్టికుండ ఒకటి బయటపడింది.
నేలకొండపల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం వద్ద జరుగుతున్న తవ్వకాల్లో వందల ఏళ్ల క్రితం నాటి మట్టికుండ ఒకటి బయటపడింది. దాని నిండా ప్రమిదలున్నాయి. అయితే పురావస్తు శాఖ అధికారుల పర్యవేక్షణ లేక కూలీలే తవ్వకాలు జరుపుతుండటంతో మట్టికుండ, ప్రమిదలు పగిలిపోయాయి. అధికారులు అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణలో తవ్వకాలు జరిగి ఉంటే మట్టికుండను, ప్రమిదలను పగలకుండా బయటకు తీయించేవారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారుల పర్యవేక్షణ కొనసాగాలని కోరుతున్నారు. బౌద్ధ స్థూపం అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇటీవల రూ.2.50 కోట్లు మంజూ రు చేయడంతో బౌద్ధుల సత్రాలు, ఆవాసాల ఆధారాల కోసం పురావస్తు శాఖ 2నెలలుగా తవ్వకాలు జరుపుతోంది.