Share News

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై ఫిర్యాదు

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:19 AM

తెలంగాణ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై వచ్చిన ప్రజా ఫిర్యాదును పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ తెలంగాణ....

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై ఫిర్యాదు

  • తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ

  • ప్రజా ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని సూచన

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 5 (ఆంధ్రజోతి): తెలంగాణ కేడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై వచ్చిన ప్రజా ఫిర్యాదును పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఈ లేఖలో.. ఎడ్ల సుధాకర్‌ రెడ్డి సమర్పించిన ప్రజా ఫిర్యాదును కూడా పంపినట్లు పేర్కొంది. అందులోని అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ సూచించింది. కాగా దీనిపై రంగనాథ్‌పై స్పందిస్తూ .. బతుకమ్మ కుంట అంశంపై ఎడ్ల సుధాకర్‌ రెడ్డి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయడం, దానిపై పరిశీలించాలని రాష్ట్రానికి లేఖలు పంపించడం సాధారణంగా జరిగేదేనని పేర్కొన్నారు. అయితే ఏదో చర్య తీసుకోబోతున్నట్లుగా వారు ఆ లేఖను సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని, ఇలా చేయడమంటే అధికారులను అప్రతిష్ఠ పాల్జేసేందుకు ప్రయత్నించడమేనని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 04:19 AM