Share News

పంజాబ్‌కు ఓ నీతి.. తెలంగాణకు మరో నీతా?

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:49 AM

పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పండిన మొత్తం ధాన్యాన్ని కొంటున్న కేంద్రప్రభుత్వం తెలంగాణలో మాత్రం 38 శాతమే కొంటామని చెప్తోందని...

పంజాబ్‌కు ఓ నీతి.. తెలంగాణకు మరో నీతా?

  • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నోరుమెదపరేం?: విప్‌ వీరేశం

  • కేటీఆర్‌.. రేవత్‌ సవాల్‌ను స్వీకరిస్తావా?: ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పండిన మొత్తం ధాన్యాన్ని కొంటున్న కేంద్రప్రభుత్వం తెలంగాణలో మాత్రం 38 శాతమే కొంటామని చెప్తోందని, ఆ రాష్ట్రాలకు ఒక నీతి, తెలంగాణకు మరో నీతి ఎందుకని ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దీనిపై ఎందుకు నోరు విప్పరని నిలదీశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, పెట్టకుంటే బీఆర్‌ఎస్‌ పార్టీ పోటీ చేయకుండా ఉంటుందా.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను కేటీఆర్‌ ఎందుకు స్వీకరించట్లేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. రాజకీయంగా హరీశ్‌రావు చిల్లర వేషాలు అందరికీ తెలుసునని, ఆయన్ను అందరూ సిద్దిపేట చిల్లర రావుగానే చూస్తారని ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ ఎద్దేవా చేశారు. ఆయన ఢిల్లీలో బీజేపీ నాయకులను కలిశారా లేదా అన్నదానిపై నేరుగా ఎందుకు సమాధానం చెప్పట్లేదని ప్రశ్నించారు.

Updated Date - Jun 01 , 2026 | 04:49 AM