యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌కు 600 కోట్లు
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:33 AM
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
యాదాద్రి అఖండ జ్యోతి రథయాత్ర ప్రారంభం
బర్కత్‌పుర, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రధాని త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారని అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేస్తే మోదీ చేతుల మీదుగా ఎంఎంటీఎస్ రెండో దశకు భూమి పూజ చేస్తామని తెలిపారు. ఎంఎంటీఎస్ ఏర్పాటుచేస్తే హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. బర్కత్‌పుర యాదాద్రిభవన్ నుంచి యాదగిరిగుట్ట వరకు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి 32వ అఖండ జ్యోతి రథయాత్రను కిషన్‌రెడ్డి ప్రారంభించి.. మాట్లాడారు. ఏటా అఖండ జ్యోతి రథయాత్రను నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామాలగుండా ఈ రథయాత్ర సాగడం వల్ల ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందన్నారు.