చిన్నతరహా జల విద్యుత్తు కేంద్రాలకు సాయం
ABN , Publish Date - May 16 , 2026 | 04:44 AM
దేశవ్యాప్తంగా 1500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రాలకు చేయూత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒక మెగావాట్ నుంచి 25 మెగావాట్ల లోపు సామర్థ్యం...
2030-31 దాకా 2,584 కోట్లను ప్రతిపాదించిన కేంద్రం
దేశవ్యాప్తంగా 1500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన చిన్నతరహా జలవిద్యుత్ కేంద్రాలకు చేయూత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒక మెగావాట్ నుంచి 25 మెగావాట్ల లోపు సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులకు రూ.2,584 కోట్ల ఆర్థిక సాయం లభించనుంది. 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరాల్లో దీన్ని అందించనున్నారు. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనికోసం అటవీ, టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్‌లు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ, నీటిపారుదలశాఖల నుంచి ఎన్‌వోసీ పొందడం, ట్రాన్స్‌కో నుంచి గ్రిడ్ కనెక్టివిటీ అనుమతి, రక్షిత అటవీ ప్రాంతంలో ఉంటే వైల్డ్‌లైఫ్ క్లియరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఒక మెగావాట్‌కు అయ్యే వ్యయంలో 20 శాతాన్ని, రూ.20 కోట్లకు మించకుండా సాయం అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అలాట్‌మెంట్ పత్రంతో పాటు దరఖాస్తు చేసుకోవాలి. అమలు ఏజెన్సీగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)ను ఏర్పాటు చేశారు.