పేద విద్యార్థులకు వరం ‘సెంట్రలైజ్డ్ కిచెన్’
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:34 PM
రాష్ట్రవ్యా ప్తం గా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అ ల్పాహారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తు న్న ఏర్పాట్లలో భాగంగా ‘సెంట్రలైజ్డ్ కిచెన్’ (కేంద్రీకత వంటశాల) నిర్మాణానికి రూపకల్పన చేసింది.
హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి అందనున్న పౌష్టికాహారం
మంచిర్యాలలో రూ.8కోట్ల సింగరేణి సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాట్లు
చివరి దశకు చేరుకున్న కిచెన్ నిర్మాణ పనులు
నెలాఖరులోగా ప్రారంభానికి సన్నాహాలు
మంచిర్యాల, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యా ప్తం గా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అ ల్పాహారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తు న్న ఏర్పాట్లలో భాగంగా ‘సెంట్రలైజ్డ్ కిచెన్’ (కేంద్రీకత వంటశాల) నిర్మాణానికి రూపకల్పన చేసింది. ప్రతి ప్ర భుత్వ పాఠశాలల్లో విడివిడిగా వంట చేయడం కాకుం డా, ఒక పెద్ద ఆధునిక వంటశాలలో వేలాది మంది విద్యార్థులకు ఒకేసారి భోజనం తయారు చేసి, ప్రత్యేక వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా చేసే ఉద్దేశ్యం తో రేవంత్ సర్కారు ‘సెంట్రలైజ్డ్ కిచెన్’లను తెరపైకి తె చ్చింది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల వి ద్యార్థులకు ఉదయం పౌష్టికాహారంతో కూడిన అల్పా హారంతోపాటు జూనియర్‌కళాశాలల విద్యార్థులకు మ ధ్యాహ్న భోజనాన్ని సమకూర్చనున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల్లో ఈ విధానం అమల్లోకి రానుండగా, రెండెకరాల స్థలంలో అన్ని హంగులతో కూడిన అత్యా ధునిక కిచెన్ నిర్మించేలా చర్యలు చేపడుతున్నారు. ఇక్క డ తయారు చేసిన వంటలను గరిష్టంగా మూడు గం టల వరకు వేడిగా ఉండే విధంగా ప్రత్యేక ఏర్ప్డాట్లు చే స్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు, కళాశా లలకు భోజన సమయం వరకు అందజేసే విధంగా అ వసరమైన చర్యలు చేపడుతోంది.
రూ.8కోట్ల సీఎస్‌ఆర్ నిధులు కేటాయింపు..
మంచిర్యాల జిల్లాలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలోని పాత బీట్‌మార్కెట్ ఏరియా లో ‘సెంట్రలైజ్డ్ కిచెన్’ పనులు చురుగ్గా సాగుతున్నా యి. ఇందుకోసం సింగరేణి సీఎస్‌ఆర్ నిధులు రూ.8 కో ట్లతో చేపట్టిన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకు న్నాయి. ఈ నెలాఖరు లోగా పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నారు. కిచెన్ నిర్మాణం, వంటత యా రీ సామగ్రి, ఇతరఏర్పాట్లు పూర్తికాగానే హరేకృష్ణ మూ వ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధీనంలోకి వెళ్ల నుంది. ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు భోజనం అందించనున్నారు. వంట తయారు మొదలుకొని ఆ యా పాఠశాలలు, కళాశాలలకు తరలించడం వరకు హరేకృష్ణ ఫౌండేషన్ బాధ్యతలు నిర్వర్తించనుంది. భో జనం తరలించేందుకు అవసరమైన వాహనాలు, సిబ్బం దిని కూడా సంస్థనే సమకూర్చుకోనుంది.
జిల్లాలో 50వేల మందికి లబ్ధి..
రేవంత్ సర్కారు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలా ది మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందనుంది. మం చిర్యాల ‘సెంట్రలైజ్డ్ కిచెన్’ ద్వారా 50వేలమంది విద్యా ర్థులకు నాణ్యమైన భోజనం అందజేయనున్నారు. సు మారు 45వేల మందికి ఉదయం ఆల్పాహారం అంద జే యనుండగా, ఐదు వేలపై చిలుకు మందికి అడ్మిషన్ల సంఖ్యను బట్టి మధ్యాహ్న భోజనం ఇవ్వనున్నారు. ఇం దులో భాగంగా విద్యార్థులకు మెనూ తయారు కూడా చేశారు. ఉదయం మిల్లెట్లతో కూడిన ఇడ్లీ, ప్లేన్ ఇడ్లీ, బోండా, పూరి, దోశ, ఉప్మా రోజుకో రకం చొప్పున వండి వార్చ నున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా పౌష్టికాహారం విలువలతో కూ డిన వంటకాలు చేయనున్నారు. వాటితోపాటు వేడిపాలు, రాగి జావ రోజుకొక టి చొప్పున భోజనంలో భాగంగా అందజేయనున్నారు. మంచిర్యాల కిచెన్‌కు జి ల్లాలోని 15మండలాలతోపాటు పెద్ద పల్లి జిల్లాలోని అంతర్గాం, రామగుండం, పాలకుర్తి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను అనుసంధానం చేశారు. అలాగే మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి, భీమిని, తాండూరు మండలా లను సమీప పొరుగు జిల్లా అయిన కుమరంభీం ఆసిఫాబాద్‌లోని కాగజ్‌నగర్ ‘కిచెన్’కు అటాచ్ చేశారు. దూరభారం తగ్గించే క్రమంలో వివిధ మండలాలను పొరుగు జిల్లాలకు అటాచ్ చేయడం ద్వారా సకాలంలో విద్యార్థులకు భోజనం అందించే చర్యలు చేపడుతున్నారు.