దేవాదుల పరిశీలనకు నేడు, రేపు కేంద్ర బృందం పర్యటన
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:16 AM
జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు ఈనెల 12, 13వ తేదీల్లో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది...
హైదరాబాద్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు ఈనెల 12, 13వ తేదీల్లో కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ బృందంలో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లోని ఐఎస్ఎన్ విభాగం డైరెక్టరేట్, కేంద్ర భూగర్భ వ నరుల శాఖతో పాటు కేంద్ర భూగర్భ వనరుల మండలి అధికారులు ఉన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)లో ఉండడంతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్ జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది.