రేడియల్ రింగు రోడ్డుకు కేంద్ర అటవీ శాఖ ఓకే
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:14 AM
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రింగ్ రోడ్డుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదివారం అనుమతి ఇచ్చింది..
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రింగ్ రోడ్డుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదివారం అనుమతి ఇచ్చింది. ఓఆర్‌ఆర్ రావిర్యాల ఎగ్జిట్ నుంచి ఆమన్‌గల్ వద్ద రీజినల్ రింగురోడ్డు వరకు దీనిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోడ్డు కింద 87.66 హెక్టార్ల అటవీ భూమి పోతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్ జిల్లాలో భూమిని కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరకు తలమడుగు మండలంలోని ఝారీ గ్రామం లో 43.4, కొత్తూరులో 40.5, కుచులాపూర్‌లో 13.3 హెక్టార్ల భూమిని కేటాయించింది. కాగా కేంద్ర అనుమతులు లేకుం డా తదుపరి మార్పులు చేయవద్దని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది.