Share News

ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

ABN , Publish Date - May 19 , 2026 | 01:05 AM

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రైతులు ధాన్యం అధికంగా పండించారని ఆ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో సోమవారం

ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
సిరిసిల్లలో మాట్లాడుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

సిరిసిల్ల అర్బన్‌, మే 18 (ఆంఽధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రైతులు ధాన్యం అధికంగా పండించారని ఆ ధాన్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై అనేక ఆంక్షలు విధించిందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలో రైస్‌ మిల్లులలో ఽధాన్యం నిల్వలు పేరుకపోవడంతో ఈ సారి కొనుగోలు చేసిన ధాన్యంతో పాటు నిల్వలను కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలంటే పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సారీ ఎన్నడు లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్‌లైన్‌ అనే విధానం తీసుకవచ్చి 15 రోజుల ఆలస్యంగా కొనుగోలు చేస్తుందన్నారు. రైస్‌మిల్లులు ధాన్యంతో నిండిపోవడంతో గోదాంలలో నిల్వలు చేయడం జరు గుతుందన్నారు. నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ మాత్రం సీఎంపై అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీతో సమన్వయంతో సాగుతుందని కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకవ చ్చినా బీఆర్‌ఎస్‌ పార్టీ అడ్డుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కొడుకు ఘటనను కేటీఆర్‌ సవాల్‌గా తీసుకుని రోడ్లపైకి వచ్చి బూతులు తిట్టుకోవడం, కోట్టుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విఫ్‌ అది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 01:05 AM