కార్మికుల సంక్షేమం పట్టని కేంద్ర ప్రభుత్వం
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:48 AM
కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని మునిసిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న ఆరోపించారు.
హుజూర్‌నగర్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందని మునిసిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న ఆరోపించారు. పట్టణంలోని ఇందిరాభవన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేదలందరికీ మోడల్ కాలనీలో ఇళ్లు అందిస్తామన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహకారంతో రెండు వేల ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఛైర్మన్, వైస్‌ఛైర్మన్లుగా ఎన్నికైన శ్రీనివాస్, మల్లికార్జున్‌రావులను సన్మానించారు. కార్యక్రమంలో బెల్లంకొండ గురవయ్య, అమర్‌నాథ్‌రెడ్డి, జ్ఞానయ్య, ముక్కంటి, వెంకన్న, లలిత, ఇన్నారెడ్డి, నర్సింహారావు, వీరబాబు, రామరాజు పాల్గొన్నారు.