Share News

పంచాయతీలకు రూ.640 కోట్లు

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:47 AM

15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో మరో రూ.640 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది.

పంచాయతీలకు రూ.640 కోట్లు

  • విడుదల చేసిన కేంద్రం

హైదరాబాద్‌, మార్చి 13(ఆంధ్రజ్యోతి): 15వ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో మరో రూ.640 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం బకాయిలను కేంద్రం విడుదల చేసినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైన యుటిలిటీ సర్టిఫికెట్లు, ఇతర నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నందున నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైందని మంత్రి సీతక్క తెలిపారు.

జల్‌జీవన్‌ మిషన్‌ మరో రెండేళ్లు: సీతక్క

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రం చేపట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ గడువును మరో రెండే ళ్లు పొడిగించడం హర్షణీయమని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌పాటిల్‌ అన్నిరాష్ట్రాల మంత్రులతో శుక్రవారం జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. వేలకోట్లు ఖర్చుచేసి ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తోందని, దీని నిర్వహణ వ్యయంలో కేంద్రం కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ఆవాసాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన నిధులను కూడా కేంద్రం అందించాలని మంత్రి సీతక్క కోరారు.

Updated Date - Mar 14 , 2026 | 05:47 AM